Share News

వేసవిలో విజ్ఞానం

ABN , Publish Date - May 24 , 2024 | 11:41 PM

విద్యార్థుల్లో విజ్ఞానం, మానసిక వికాసం పెంపొందించడంతో పాటు వినోదాన్ని అందించేందుకు వేసవి విజ్ఞాన శిబిరాలు ఎంతగానో దోహదపడతాయి.

వేసవిలో విజ్ఞానం
విజ్ఞాన శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు

గ్రంథాలయాల్లో ప్రత్యేక శిక్షణ శిబిరాలు

ఏలూరు టూటౌన్‌, మే 24: విద్యార్థుల్లో విజ్ఞానం, మానసిక వికాసం పెంపొందించడంతో పాటు వినోదాన్ని అందించేందుకు వేసవి విజ్ఞాన శిబిరాలు ఎంతగానో దోహదపడతాయి. ఏటా విద్యార్థులకు జిల్లా గ్రంథాల య సంస్థ, హేలాపురి చిల్డ్రన్స్‌క్లబ్‌, ఇతర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఈ నెల 15 నుంచి ప్రారంభ మైన శిబిరాలు జూన్‌ 7 వరకు కొనసాగుతాయి. ఏలూరులో జిల్లా గ్రంథాల యం, బాలల గ్రంథాలయం, మహిళా గ్రంథాలయం, హేలాపురి చిల్డ్రన్స్‌ క్లబ్‌తో పాటు శాఖ గ్రంథాలయాలు స్వచ్ఛంద సంస్థలు వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. రిసోర్స్‌పర్సన్లు, టీచర్లు, సమాజ సేవకులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణలో కథలు వినిపించడం, వాటిలో నీతి నేర్పడం, ఆటలు, క్రీడల పోటీలు, పుస్తక పఠనం, పుస్తకాలపై సమీక్ష, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, డ్రాయింగ్‌, పేపర్‌ క్రాఫ్ట్స్‌, మ్యూజిక్‌, డ్యాన్స్‌, పేపర్లతో వస్తువుల తయారీ నేర్పుతున్నారు.

విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో ఉపయోగం

విజ్ఞాన శిబిరాల్లో నేర్చుకున్న అంశాలు భవిష్యత్‌లో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయి. తెలియని విషయాలు ఎన్నో విద్యార్థులు నేర్చుకుంటు న్నారు. సెలవుల్లో చదువుపై శ్రద్ధ పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఆటల పోటీలు నిర్వహించడం వలన విద్యార్థుల్లో మానసిక వికాసం కలుగుతుంది. సమాజంలో సాంప్రదాయాలు కూడా నేర్చుకుంటారు.

– జి.కల్యాణి, రిసోర్స్‌పర్సన్‌

ఆలోచన శక్తి పెరుగుతుంది

విజ్ఞాన శిబిరాలతో విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెరుగుతుంది. ఏ వస్తువునైన పనికిరాదని పారేయకుండా ఆ వస్తువుతో పలు రకాల వస్తువు లు తయారు చేసే విధానం నేర్పుతున్నాం. విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెరుగుతంది. ఆటల పోటీల వలన ఉల్లాసంగా ఉత్సాహం విద్యార్థులు యాక్టివ్‌గా ఉంటారు. లాజికల్‌ థింకింగ్‌ పెరగుతుంది.

– వై.శ్రీవల్లి, రిసోర్స్‌పర్సన్‌

ఆత్మరక్షణకు ఉపయోగం

వేసవి శిబిరాల్లో ఆత్మరక్షణ కోసం కర్రసాము, కరాటే వంటి విద్యలు నేర్పుతున్నాం. అభ్యుదయ బాటలో ఏకపాత్రాభినయం నేర్చుకుంటున్నారు. మొబైల్‌ ఫోన్‌ వలన నష్టాలు తెలుసుకుంటున్నారు. నలుగురితో కలిసి ఉండడం నేర్చుకుంటున్నారు. శిబిరాల వలన విద్యార్థుల్లో ఒంటరి భావన పోతుంది. మూఢనమ్మకాలు, అపోహలు తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. శిబిరాల వలన విద్యార్థులు సామాజాభివృద్ధికి తోడ్పడతారు.

– దుర్గా ప్రసాద్‌, హేలాపురి చిల్డ్రన్స్‌ క్లబ్‌ కార్యదర్శి

గణితంలో మెళకువలు నేర్చుకుంటున్నాం

శిబిరానికి వచ్చిన తరువాత లెక్కల్లో మెళకువలు నేర్చుకుంటున్నాను. లెక్కలంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది. ఈ శిబిరాల్లో లెక్కలు చేయడం సులువైంది. ఇప్పుడు లెక్కలంటే భయం లేదు నాకు.

ప్రియాంక, 8వ తరగతి

సెలవులు సద్వినియోగం

సెలవుల్లో విజ్ఞాన శిబిరాలు ఎంతో ఉపయోగపడు తున్నాయి. జాతీయ నాయకులు, మహనీయుల జీవిత చరిత్ర తెలుసుకుంటున్నాను. శిబిరాల్లో రకరకాల కథల పుస్తకాలు చదివించి నీతిని వివరిస్తున్నారు.

ఆదిత్య, 9వ తరగతి

పత్రికలు చదవడం నేర్చుకుంటున్నా

విజ్ఞాన శిబిరాల్లో దినపత్రికలు చదివించడంతో భాషపై పట్టు ఏర్పడింది. కొత్త పుస్తకాలు చదవి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను. క్యారమ్స్‌, చెస్‌, క్రాప్ట్‌ ఆటల వలన మేధాశక్తి పెరుగుతుంది.

గ్రీష్మ, 8వ తరగతి

Updated Date - May 24 , 2024 | 11:41 PM