Share News

నీట్‌ రద్దు కోరుతూ విద్యా సంస్థల బంద్‌

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:20 AM

నీట్‌–యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల విద్యార్థులకు వాటిల్లిన నష్టం, పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ విద్యా ర్థి సంఘాల ఐక్య వేదిక(స్టూడెంట్‌ జేఏసీ) ఆధ్వర్యంలో గురువారం దేశవ్యాప్తంగా చేపట్టిన విద్యా సంస్థల బంద్‌ జిల్లాలో విజయవంతమైంది.

నీట్‌ రద్దు కోరుతూ విద్యా సంస్థల బంద్‌
ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో విద్యార్థి సంఘాల జేఏసీ నాయకుల ధర్నా

విద్యా ర్థి సంఘాల ఐక్య వేదిక ధర్నా

ఏలూరు అర్బన్‌, జూలై 4 : నీట్‌–యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల విద్యార్థులకు వాటిల్లిన నష్టం, పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ విద్యా ర్థి సంఘాల ఐక్య వేదిక(స్టూడెంట్‌ జేఏసీ) ఆధ్వర్యంలో గురువారం దేశవ్యాప్తంగా చేపట్టిన విద్యా సంస్థల బంద్‌ జిల్లాలో విజయవంతమైంది. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలను స్వచ్ఛందంగానే మూసివేయగా, ప్రభుత్వ పాఠశాలలు, కళా శాలల వద్దకు విద్యార్థి సంఘాల బృందాలు వెళ్లి మూసి వేయించా యి. ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ వద్ద ధర్నా చేశారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కె.నాని మాట్లాడుతూ ప్రశ్నా పత్రం లీకేజీపై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయలేని స్థితిలో ఉండడం దురదృష్టకరమన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లెనిన్‌, పీడీఎస్‌వో జిల్లా కార్యదర్శి ఎస్‌.మోహన్‌ మాట్లాడారు.

బుట్టాయగూడెం: నీట్‌ యూజీ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌ పిలుపులో భాగంగా మండలంలో విద్యా సంస్థల బంద్‌ గురువారం విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వ హించారు. మండల నాయకుడు ఎం.సిద్ధూ మాట్లాడుతూ నీట్‌ పరీక్ష నిర్వ హణపై సమగ్ర విచారణ జరపాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ యూజీ పరీక్షలను సక్రమంగా నిర్వహిం చకపోవడం వలన లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్‌ ఫలితాలు విచిత్రంగా ఉన్నాయని తక్షణమే నీట్‌ పరీక్షను రద్దుచేసి మరలా నిర్వహించాలని విద్యార్ధులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పి.మహేష్‌, కె.సాయి తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: నీట్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా సంస్థల బంద్‌ పట్టణంలో ప్రశాంతంగా జరిగింది. పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛం దంగా మూసివేశారు. పలు పాఠశాలలు పనిచేస్తుండడంతో విద్యార్థి సంఘ నాయకులు వెళ్లి హెచ్‌ఎంలతో మాట్లాడి బంద్‌కు సహకరించాలని కోరారు. నీట్‌ పరీక్షలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో బి.జగన్‌, బి.వినోద్‌, ప్రణీత్‌, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:20 AM