Share News

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ

ABN , Publish Date - May 19 , 2024 | 11:47 PM

స్ర్టాంగ్‌ రూముల వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగులు అత్యంత అప్రమత్తంగా విధులను నిర్వర్తించాలని ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశించారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
అధికారులతో మాట్లాడుతున్న ఎస్పీ మేరీ ప్రశాంతి

ఏలూరు క్రైం, మే 19 : స్ర్టాంగ్‌ రూముల వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగులు అత్యంత అప్రమత్తంగా విధులను నిర్వర్తించాలని ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశించారు. సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏలూరు పార్లమెంటు నియోజ కవర్గానికి సంబంధించిన ఈవీఎం బాక్సులు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల ఈవీఎం బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లను ఆదివారం ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. అక్కడ వున్న భద్రత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కాలేజీ చుట్టు పక్కలకు ప్రజలు ఎవ్వరూ రాకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలన్నారు. జిల్లాలో 144వ సెక్షన్‌ అమలులో ఉన్నందున ప్రజలు ముగ్గురు కంటే ఎక్కువ గుమ్మిగూడి ఉండకూడదన్నారు. అనుమానాస్పద వాహనాలను నిత్యం తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల్లో శాంతి పరిరక్షణ దళాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల కేసులలో ఉంటే వారికి వారి కుటుంబాలకు కలిగే అనర్థాలను వివరంగా తెలిపేందుకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఏఆర్‌ అదనపు ఎస్పీ ఎన్‌ఎస్‌ఎస్‌ శేఖర్‌, ఏఆర్‌డీఎస్పీ శ్రీహరిరావు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్వరరావు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2024 | 11:47 PM