Share News

ఎన్నికల నియమావళి పాటించాలి

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:05 AM

సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో జిల్లాలో 144 సెక్షన్‌ అమలులో ఉందని, ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటిం చాలని ఎస్పీ డి.మేరీ ప్రశాంతి అన్నారు.

ఎన్నికల నియమావళి పాటించాలి
ముండూరులో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్నఎస్పీ మేరీ ప్రశాంతి

పోలింగ్‌ కేంద్రాలు పరిశీలించిన ఎస్పీ మేరీ ప్రశాంతి

పెదవేగి, మార్చి 23: సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో జిల్లాలో 144 సెక్షన్‌ అమలులో ఉందని, ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటిం చాలని ఎస్పీ డి.మేరీ ప్రశాంతి అన్నారు. మండలంలోని ముండూరు పోలింగ్‌ కేంద్రాలను శనివారం ఆమె పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశా రు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, పోలింగ్‌ కేంద్రాల్లో భద్రత, గతంలో జరిగిన అవాంఛనీయ సంఘట నలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీఎస్పీ లక్ష్మయ్య, సీఐ శ్రీనివాస కుమార్‌, పెదవేగి, దెందులూరు, పెదపాడు ఎస్‌ఐలు రాజేంద్రప్రసాద్‌, స్వామి, శుభ శేఖర్‌తో సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరికి వారు ఎన్ని కల నియమావళి అనుసరించి, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని, అప్పుడే ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటువేసే వీలుంటుందన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం, సౌకర్యాలు ఉండాలని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి, ఆయా గ్రామాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తామని ఆమె వివరించారు.

కోడ్‌ మీరితే శిక్ష తప్పదు : నగర పాలక సంస్థ కమిషనర్‌

ఏలూరు టూటౌన్‌: ఎన్నికల నియామవళికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై ఎన్నిక కమిషన్‌ చర్యలు తీసుకుంటుందని నగర పాలక సంస్థ కమి షనర్‌ ఎస్‌.వెంకటకృష్ణ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివా రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16న ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి వచ్చిందన్నారు. అప్పటి నుంచి వివిధ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, జెండాలు, రంగులు తొలగించామన్నారు. ఇళ్లు, ప్రహరీలపై కూడా ఎవరు ఎన్నికల ప్రవర్తన నియామవళికి విరుద్ధంగా రం గులు వేయడం, ఫ్లెక్సీలు కట్టడం చేయరాదన్నారు. అటువంటి వారిపై ఎన్ని కల నియమావళిననుసరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నగర పాలక సిబ్బంది ఎన్నికల నియామవళి అమలులోకి వచ్చిన నాటి నుంచి ఎక్కడా కూడా ఎటువంటి రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, జెండాలు తొలగించడంలో నిమగ్నమై ఉందన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 12:05 AM