Share News

మాజీ మంత్రి సీతాదేవికి కన్నీటి వీడ్కోలు

ABN , Publish Date - May 30 , 2024 | 12:29 AM

బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి యెర్నేని సీతాదేవికి తుది వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లో తన కుమార్తె హంసిని నివాసంలో సోమవారం వేకువజామున గుండెపోటుతో ఆమె కన్నుమూశారు.

మాజీ మంత్రి సీతాదేవికి కన్నీటి వీడ్కోలు
యెర్నేని సీతాదేవి అంతిమయాత్ర

కలిదిండి/ముదినేపల్లి, మే 29:బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి యెర్నేని సీతాదేవికి తుది వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లో తన కుమార్తె హంసిని నివాసంలో సోమవారం వేకువజామున గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. అదేరోజు రాత్రి ఆమె భౌతికకాయాన్ని స్వస్థ లం కలిదిండి మండలం కొండూరు తీసుకువచ్చారు. మంగళవారం ఆమె భర్త యర్నేని నాగేంద్రనాథ్‌తోపాటు ఎన్టీఆర్‌ జయంతి కావడంతో సెంటిమెంట్‌గా అంత్యక్రియలను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియ లు నిర్వహించారు. ఆమె పార్దివదేహం వద్ద పోలీసులు శ్రద్ధాంజలి ఘటించి, గౌరవ సూచకంగా గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం ఆమె చితికి చిన్న కుమారుడు మురారి నిప్పంటించారు. ఆమె అంతిమయాత్రలో రాజకీయ పార్టీల నాయకులు, రైతులు, అభిమానులు, గ్రామస్థులు, కుటుంబసభ్యులు పెద్దఎత్తున పా ల్గొన్నారు. ఆమె చేసిన సేవలను తలచుకుని కన్నీటితో తుడివీడ్కోలు పలికారు. మాజీ మంత్రులు డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌, పిన్నమనేని వెంకటేశ్వరరావు, వడ్డే శోభనాదీశ్వరరావు, రాష్ట్ర రైతు సలహా మండలి చైర్మన్‌ నాగిరెడ్డి, కృష్ణా మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ, జడ్పీటీసీ బొర్రా సత్యవతి, నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌ వీరమల్లు నరసిం హారావు, కొడాలి వినోద్‌, చలసాని జగన్మోహనరావు, సర్పంచ్‌ వెంకటలక్ష్మీ, టీడీపీ, జనసేన, బీజేపీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 12:29 AM