Share News

షీ టీములు ఎక్కడ?

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:26 AM

విద్యా సంస్థలు తెరిచారు. ఈ క్రమంలో విద్యార్థి నులను టార్గెట్‌ చేస్తూ ఆకతాయిలు, అల్లరి గ్యాంగ్‌లు సంబంధిత కాలేజీల వద్దకు మోటారు సైకిళ్లపై వచ్చి చక్కెర్లు కొడుతూ విన్యా సాలు చేస్తూ వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు.

షీ టీములు ఎక్కడ?

ఏలూరు నగరంలో పెరిగిన ఈవ్‌ టీజింగ్‌

కళాశాలల వద్ద ఆకతాయిలు,అల్లరి గ్యాంగ్‌ల ఆగడాలు

బిక్కుబిక్కుమంటూ కాలేజీలకు వెళ్తున్న విద్యార్థినులు

ఏలూరు క్రైం, జూలై 4 : జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో రోజురోజుకూ ఈవ్‌టీజింగ్‌ జోరు పెరుగుతోంది. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో పోలీసులు ఊపిరి పీల్చుకోవడానికి ఖాళీ లేకుండా విధులు నిర్వహించి శాంతియుతంగా ఎన్ని కలను నిర్వహించారు. ఇదే సమయంలో మిగిలిన కార్యకలాపాలపై దృష్టిని తగ్గించారు. ప్రస్తుతం ఎన్నికల హడావుడి ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్ప డింది. ఇక బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విధుల పట్ల వీరు అంతగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విద్యా సంస్థలు తెరిచారు. ఈ క్రమంలో విద్యార్థి నులను టార్గెట్‌ చేస్తూ ఆకతాయిలు, అల్లరి గ్యాంగ్‌లు సంబంధిత కాలేజీల వద్దకు మోటారు సైకిళ్లపై వచ్చి చక్కెర్లు కొడుతూ విన్యా సాలు చేస్తూ వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. కొత్తగా చేరిన విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ కాలేజీలకు వస్తున్నారు. ఈ విషయాలను తమ కుటుంబ సభ్యులకు ఎక్కడ చెబితే కాలేజీ లు మాన్పించేస్తారని భయపడుతూ తమలో తాము కుంగి పోతున్నారు. ఇంటర్మీడియట్‌ మహిళా కళాశాలలు, డిగ్రీ మహిళా కళాశాలల వద్దే ఆకతాయిల ఆగడాలు మరింత పెరిగాయి. కాలేజీ ప్రారంభమయ్యే సమయం, విడిచే సమయంలో ఆకతాయిలు చేరి ఈవ్‌టీజింగ్‌కు పాల్ప డుతున్నారు. ఆకతాయిల ఆటలు కట్టించేందుకు షీ టీమ్‌లు ఉన్నాయని గతంలో అధికారులు ప్రకటించినా అవి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. కాలేజీల వద్ద యూనిఫామ్‌లో, మఫ్టీలోనూ ఉండి ఆక తాయిలకు చెక్‌ పెట్టేవారు. ఆకతాయిలను స్టేషన్‌కు తీసుకువెళ్ళి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ చేసేవారు. ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకతాయిలు, అల్లరి గ్యాంగ్‌ల ఆగడాలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు కోరుతున్నారు.

పనిచేసే ప్రదేశంలో మహిళలపై..

లైంగిక వేధింపులు నిరోధానికి కమిటీలు : కలెక్టర్‌

ఏలూరు క్రైం, జూలై 4 : పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధానికి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి చెప్పారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో గురు వారం మహిళలపై లైంగిక వేధింపులు నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై మహిళా శిశు సంక్షేమశాఖ నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణలో కలెక్టర్‌ ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి 2013లో ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. చట్టం అమలులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మహిళలపై లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు నలుగురు సభ్యులతో ఏర్పాటు చేయాలని, వారిలో కనీసం ఇద్దరు మహిళలను సభ్యులుగా నియమించాలన్నారు. బాధిత మహిళలకు న్యాయం జరిగేలా సంబంధిత కమిటీలు పనిచేయాలన్నారు. ఏఎస్పీ స్వరూపరాణి మాట్లాడుతూ పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు జరిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ఆ చట్టం అమలుపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ముద్రించిన పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. జడ్పీ సీఈవో సుబ్బారావు, డీపీవో శ్రీనివాస్‌ విశ్వనాథ్‌, ఆర్డీవో కె.ఖాజావలి, డీఆర్‌డీఏ పీడీ విజయరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:26 AM