Share News

నేలపాలైన పెట్రోల్‌కు నిప్పు పెట్టిన ఆకతాయి

ABN , Publish Date - May 20 , 2024 | 12:00 AM

ఆకతాయి చేసిన పనికి నూజివీడు మండలం మీర్జాపురం గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఐదు ఫైరింజన్లు నిరం తరం శ్రమించాల్సి వచ్చింది.

నేలపాలైన పెట్రోల్‌కు నిప్పు పెట్టిన ఆకతాయి
ఎగసిపడుతున్న మంటలు

నూజివీడు టౌన్‌, మే 19: ఆకతాయి చేసిన పనికి నూజివీడు మండలం మీర్జాపురం గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఐదు ఫైరింజన్లు నిరం తరం శ్రమించాల్సి వచ్చింది. శనివారం నాడు నూజివీడు మండలం మీర్జాపు రం గ్రామం వద్ద పెట్రోల్‌ ట్యాంకరు టైరు పేలి ఆటోను ఢీ కొన్న విషయం విదితమే. ట్యాంకర్‌ బోల్తాతో భారీగా పెట్రోల్‌ నేలపాలు కాగా రహదారి పక్కనే ఉన్న డ్రైన్‌లోకి అది చేరింది. అయితే ఆ డ్రైన్‌లో గుర్తు తెలియని వ్యక్తి నిప్పు రాజేయడంతో పెట్రోల్‌ ఒక్కసారిగా మండి ఆ మంటలు ఘటనా స్థలం వద్దకు చేరి అగ్నికీలలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యా రు. మరోవైపు సమీపంలోనే పెట్రోల్‌ బంకు ఉండటంతో అనుక్షణం ఆందోళనకు గురయ్యారు. వెంటనే హనుమాన్‌ జంక్షన్‌, నూజివీడు, ఏలూరు, గన్నవరం తదితర ఫైర్‌ స్టేషన్‌ల నుంచి ఐదు అగ్నిమాపక శకటాలు నిరంతరం శ్రమించాల్సి వచ్చింది. శనివారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో మంటలు అంటుకోగా అగ్నిమాపక సిబ్బంది శ్రమించి ఆదివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో వాటిని మంటలు అదుపులోకి తెచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ట్యాంకర్‌ నుంచి లీకైన పెట్రోల్‌కు మంటలు అంటుకోవడానికి ముందే సదరు ట్యాంకర్‌ను పోలీసులు ప్రమాదసంఘటనా స్థలం నుంచి దూరంగా తరలించడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు.

Updated Date - May 20 , 2024 | 12:00 AM