Share News

నోటికి నల్ల రిబ్బన్‌తో సెర్ప్‌ ఉద్యోగుల నిరసన

ABN , Publish Date - Jan 29 , 2024 | 11:59 PM

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెర్ప్‌ ఉద్యోగుల చేపట్టిన సమ్మె సోమవారం ఆరో రోజుకు చేరింది.

నోటికి నల్ల రిబ్బన్‌తో సెర్ప్‌ ఉద్యోగుల నిరసన
నల్లచీరలు ధరించి నిరసన తెలియజేస్తున్న సెర్ప్‌ సిబ్బంది

ఏలూరు కలెక్టరేట్‌, జనవరి 29: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెర్ప్‌ ఉద్యోగుల చేపట్టిన సమ్మె సోమవారం ఆరో రోజుకు చేరింది. మహిళలు నల్లచీరలు, పురుషులు నల్ల చొక్కాలు ధరించి నోటికి నల్ల రిబ్బన్‌ కట్టుకుని నిరసన తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో కీలకపాత్ర పోషిస్తున్నామన్నారు. సెర్ప్‌ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్‌ చేయాలని, తెలంగాణ మాదిరిగా పే స్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు తక్షణం పరిష్కరించాలన్నారు.

విశాఖలో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్‌పై నిరసన

విశాఖలో ఆర్టీసీ యాజమాన్య కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని పోలీసులు బలవంతంగా తొలగించి అరెస్ట్‌ చేయడాన్ని కార్మికులు ఖండించారు. ఏలూరు ఆర్టీసీ డిపో గ్యారేజ్‌ వద్ద ఎన్‌ఎంయూఏ నాయకులు సోమవారం ఎర్ర బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. డిపో అధ్యక్ష, కార్యదర్శులు పీవీఎస్‌ఎన్‌.ప్రసాద్‌, పువ్వుల శ్రీనివాసరావు, డిపో ఉపాధ్యక్షుడు కేఆర్‌కే.రావ్‌ మాట్లాడుతూ విశాఖలో ఆర్టీసీ యాజమాన్యం నిరంకుశ చర్యలకు పాల్పడుతుందన్నారు. విశాఖ ఆర్టీసీ యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ రెండురోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. బస్సు డ్రైవర్లపై కేసులను వెంటనే ఎత్తివే యాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జోనల్‌ చీఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.ప్రసాదరావు, ఎన్‌ఎంయూఏ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 11:59 PM