Share News

పరస్పర సహకారంతో మద్యం అక్రమ రవాణా అరికట్టాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:37 AM

తాటియాకులగూడెంలో ఆంధ్ర– తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద సోమవారం ఇరు రాష్ట్రాల ఎస్‌ఈబీ అఽధికారులతో సమన్వయ సమావేశం జరిగింది.

పరస్పర సహకారంతో మద్యం అక్రమ రవాణా అరికట్టాలి
తాటియాకులగూడెం రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఆంధ్ర–తెలంగాణ ఎస్‌ఈబీ అధికారుల సమావేశం

ఇరు రాష్ట్రాల ఎస్‌ఈబీ అధికారుల సమావేశం

జీలుగుమిల్లి, ఏప్రిల్‌ 15 : సార్వత్రిక ఎన్నికల నేపఽథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ఎస్‌ఈబీ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో మద్యం అక్రమ రవాణా అరికట్టడానికి పరస్పర సహకారం అవసరమని భద్రాచలం ఎస్‌ఈబీ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ పి.కారంచంద్‌ అన్నారు. తాటియాకులగూడెంలో ఆంధ్ర– తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద సోమవారం ఇరు రాష్ట్రాల ఎస్‌ఈబీ అఽధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికలు, ఆంధ్రలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. బూర్గంపాడు, కుక్కునూరు, ఏటపాక, చింతలపూడి, తాటియాకులగూడెం సరిహద్దు ప్రాంతాల్లో 24 గంటల పాటు పూర్తి నిఘా ఉంచామని అధికారులు చెప్పారు. ఎస్‌ఈబీ సీఐలు వై.పట్టాభి చౌదరి, కె.సాంబమూర్తి, రెహమున్నీసా, బీఎస్‌ఎస్‌వి ప్రసాద్‌, ఏఎంవీఐ సురేష్‌, ఈవోపీఆర్డీ నిఖిల్‌ మధుశరన్‌, ఎస్సైలు ఎలియాజర్‌, శేఖర్‌బాబు హెడ్‌ కానిస్టేబుళ్లు సిబ్బంది ఉన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:37 AM