Share News

దక్షిణ భారత సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు చింతలపూడి విద్యార్థినుల ఎంపిక

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:21 AM

రాష్ట్రస్థా యి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ గ్రూప్‌ విభాగం ప్రదర్శ నల్లో ప్రథమ స్థానంలో నిలిచి దక్షిణభారత సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు చింతలపూడి జడ్పీ హైస్కూలు విద్యార్థినులు ఎంపిక య్యారు.

దక్షిణ భారత సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు చింతలపూడి విద్యార్థినుల ఎంపిక
విద్యార్థినుల బృందానికి ప్రశంసాపత్రాలు అందజేస్తున్న కలెక్టర్‌ తదితరులు

రాష్ట్రస్థాయి విజేతలకు ఏలూరు జిల్లా కలెక్టర్‌ అభినందనలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 31 : రాష్ట్రస్థా యి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ గ్రూప్‌ విభాగం ప్రదర్శ నల్లో ప్రథమ స్థానంలో నిలిచి దక్షిణభారత సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు చింతలపూడి జడ్పీ హైస్కూలు విద్యార్థినులు ఎంపిక య్యారు. జాతీయ శాస్త్ర, సాంకేతిక మండలి (ఎన్‌సీఎస్‌టీ) ఆధ్వర్యంలో గతనెల 28,29 తేదీల్లో కడపలో నిర్వహించిన గ్రూప్‌ విభాగం ప్రదర్శనలో ఎంపికైన కె.మహిత, ఎం.శ్రీవర్థిని, గైడ్‌టీచర్‌ కె.రవికుమార్‌లను ఆదివారం ఏలూరులో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అభినందించారు. ఈ ఏడాది బాలాసోర్‌, పలాసలలో చోటుచేసుకున్న రెండు ఘోర రైలు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని రైలు ప్రమాదాలను నిరోధించేందుకు ఆటోమేటిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిస్టం, కవచ్‌ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రమాదాలను ఎలా నివారించవచ్చో ఈ విద్యార్థినుల బృందం ప్రదర్శనలో చూపించిన విషయం తెలిసిందే.. ఆయా రాష్ట్రస్థాయి పోటీల విజేతలతో జనవరి 27నుంచి ఆరు రోజుల పాటు విజయవాడలో దక్షిణభారత సైన్సు ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో ఎంపికైన విద్యార్థులు జాతీయస్థాయి ఎగ్జిబిషన్‌కు అర్హత సాధిస్తారు. ఈ పోటీల్లో సౌత్‌నుంచి మొత్తం 8 రాష్ట్రాల సైన్స్‌ ఎగ్జిబిషన్‌ల విజేతలు పాల్గొంటారని జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ సీహెచ్‌.ఆర్‌.ఎం.చౌదరి, డీఈవో పి.శ్యాంసుందర్‌, స్కూలు హెచ్‌ఎం వడ్లపట్ల మురళీకృష్ణ తెలిపారు.

Updated Date - Jan 01 , 2024 | 12:21 AM