Share News

తొలి మహిళా టీచర్‌ సావిత్రిబాయి పూలే

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:00 AM

తొలి మహిళా టీచర్‌ సావిత్రిభాయ్‌పూలే వర్ధంతి సందర్భంగా జడ్పీ కార్యాలయం వద్ద విగ్రహానికి జడ్పీ చైర్మన్‌ ఘంటా పద్మశ్రీ తదితరులు పూల మాలలు వేసి ఘననివాళులర్పించారు.

తొలి మహిళా టీచర్‌ సావిత్రిబాయి పూలే
పూలే విగ్రహం నివాళులర్పిస్తున్న జడ్పీ చైర్మన్‌ ఘంటా పద్మశ్రీ

వర్ధంతి కార్యక్రమాల్లో పలువురి నివాళి

ఏలూరు రూరల్‌, మార్చి 10: తొలి మహిళా టీచర్‌ సావిత్రిభాయ్‌పూలే వర్ధంతి సందర్భంగా జడ్పీ కార్యాలయం వద్ద విగ్రహానికి జడ్పీ చైర్మన్‌ ఘంటా పద్మశ్రీ తదితరులు పూల మాలలు వేసి ఘననివాళులర్పించారు. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే ఎంతో మం దికి విద్యాదానం చేశారని, బాలికలకు ఒక పాఠశాల ప్రారంభించి జీవితంలో చదువు ఎదగడానికి కృషిచేశారని, తన జీవితాన్ని మహిళా అభ్యున్నతి కోసం కృషిచేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో ఘంటా ప్రసాద రావు, పామర్తి అచ్యుత్‌గౌడ్‌, లక్కోజు గోపి తదితరులు పాల్గొన్నారు.

కామవరపుకోట: దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సమా జానికి సావిత్రీబాయి పూలే సేవలు ఆదర్శనీయమని రావికంపాడు తెలుగు ఉపాధ్యాయుడు బిరుదుగడ్డ నాగేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు, అధ్యాప కులు, సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివా ళులర్పించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ స్త్రీల విద్యాభివృద్ధి, హక్కుల కోసం ఆమె ఎనలేని కృషి చేశారన్నారు. ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాల వద్ద పూలే వర్ధంతిని అధ్యాపకులు, విద్యార్థులు నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆమె సేవలను గుర్తు చేసుకు న్నారు. కార్యక్రమాల్లో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:00 AM