సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి : కలెక్టర్
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:05 AM
సంప్రదాయాలకు ప్రతీక, తెలుగు వాళ్ళ అతి పెద్ద పండుగ సంక్రాంతి అని.. కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి ఆనందో త్సాహాలతో వేడుకలు జరుపుకుంటారని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు.

భీమవరం, జనవరి11 : సంప్రదాయాలకు ప్రతీక, తెలుగు వాళ్ళ అతి పెద్ద పండుగ సంక్రాంతి అని.. కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి ఆనందో త్సాహాలతో వేడుకలు జరుపుకుంటారని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్ ట్రెజరీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రారం భించారు.జిల్లా ట్రెజరీ అధికారి ఆడారి గణేష్ ఆధ్వర్యంలో సంప్రదాయం ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించడాన్ని అభినందించారు. మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాల్లో భాగంగా రంగవల్లులు, బొమ్మల కొలువు, భోగి మంట, ధాన్యపు కంకులు, రేగిపళ్ళు మొదలైన వాటితో తీర్చిదిద్దారు. సంక్రాంతి వంటలైన కొబ్బరి అన్నం, పులిహార, పెరుగు ఆవడ, అరిసెలు, బూరెలు, గారెలు, బొబ్బట్లు, కాజాలు, సున్నుండలు, లడ్డూలు పూత రేకులు, కజ్జికాయలు, జంతికలు, అప్పడాలు, ఉలవచారు, పచ్చిపులుసు, రోటి పచ్చడి మొదలైన పిండివంటలను సిబ్బంది స్వయంగా తయారుచేసి ఆహూతులకు సంక్రాంతి విందు ఏర్పాటు చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, డీపీఆర్వో నాగేశ్వరరావు, డీఎల్‌డీవో అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.