ఇసుక దోపిడీ
ABN , Publish Date - Mar 03 , 2024 | 11:59 PM
సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్నాయి.ఎంత సంపా దించకున్నా మరో నెల రోజులే.. రాబోయే ప్రభుత్వంలో అవకాశం ఉండదు. దీపం ఉండగానే ఇళ్లు చక్క బెట్టుకావాలి. ఇసుక మాఫియా ఈ సూత్రాన్ని బాంగా వంటపట్టించు కుంది. అధికార పార్టీ నాయకులే ఇసుక మాఫియా అవతారమెత్తారు. అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు.
ఎన్నికల ముందు అక్రమ తవ్వకాలు
అధికార పార్టీ నేతలే కీలక వ్యక్తులు
రాత్రి వేళల్లో అక్రమ రవాణా
కన్నెత్తి చూడని అధికారులు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్నాయి.ఎంత సంపా దించకున్నా మరో నెల రోజులే.. రాబోయే ప్రభుత్వంలో అవకాశం ఉండదు. దీపం ఉండగానే ఇళ్లు చక్క బెట్టుకావాలి. ఇసుక మాఫియా ఈ సూత్రాన్ని బాంగా వంటపట్టించు కుంది. అధికార పార్టీ నాయకులే ఇసుక మాఫియా అవతారమెత్తారు. అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తే ముందుగానే లీకులు వెళుతున్నాయి.దాంతో ఇసుక ర్యాంప్‌ల ఎక్స్ కవేటర్లు నుంచి మాయమై పోతున్నాయి. ఆ తర్వాత మళ్లీ తవ్వకాలు సాగిస్తున్నారు. జిల్లాలో ఇంకా అనుమతులు రాకుండానే దందా సాగిస్తున్నారు. సిద్ధాంతం నుంచి నర్సాపురం వరకు గోదావరి తీరంలో ఆరు ర్యాంప్‌లను అనుమతి కోసం పెట్టారు. ప్రభుత్వ స్థాయిలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతలోగానే అక్రమార్కులు తవ్వకాలు సాగించే స్తున్నారు. దందాను అడ్డుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆచంట నియోజకవర్గం, యల మంచిలి మండల పరిధిలో తవ్వకాలు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక దందాను తీర ప్రాంతాలు గ్రామస్థులు అడ్డుకుంటున్న సందర్భాలు ఉంటున్నాయి. అయినా సరే మట్టి మాఫియా చెలరేగిపోతోంది. గడచిన ఐదేళ్లలో అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. బొండు ఇసుక జిల్లా సరిహద్దులు దాటింది. జగనన్న కాలనీల పూడిక పేరుతో కోట్ల రూపాయలు వ్యాపారాలు నిర్వహించారు. అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిసింది. బొండు ఇసుకను తరలించేందుకు సొంతంగా వాహనాలు కూడా సమకూర్చుకున్నారు. నిత్యం ఇతర ప్రాంతాలకు తరలించారు. అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు.
అనుమతులు ఏమో !
ఇసుక ర్యాంప్‌లకు అనుమతులు ఇచ్చినట్టయితే స్థానిక రెవెన్యూ అధికారులు తెలియాలి. ఇసుక తవ్వకాల పర్యవేక్షణ రెవెన్యూ అధికారులపై ఉంటుంది. పరిమితికి మించి తవ్వకాలు సాగిస్తే అడ్డుకోవాల్సిన బాధ్యత మైనింగ్ శాఖపై ఉంటుంది. జిల్లాలో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి తట్టుకోలేక మైనింగ్ శాఖలోని కీలక అధికారి సుదీర్ఘ సెలవుపై ఉన్నారు. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జి బాధ్యతలు వహిస్తున్నారు. ప్రధానంగా మండల స్థాయిలో రెవెన్యూ అధికారులకు ఇసుక ర్యాంప్‌ల అనుమతులు విషయం తెలియాలి. ప్రభుత్వం సమాచారం ఇవ్వాలి. అనుమతులపై రెవెన్యూ అధికారులు నోరెళ్ల బెడుతున్నారు. మైనింగ్ అధికారులు సెలవులో ఉన్నారు. ఇన్‌ఛార్జిలు స్పందించడం లేదు. మొత్తంపైన అక్రమ రవాణాతో మాఫియా చెలరేగి పోతోంది. ఆచంట నియోజకవర్గ పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో తవ్వకాలు సాగుతున్నాయి.
అధిక ధరలతో దోపిడీ
అప్పనంగా తవ్వకాలు సాగిస్తున్న మాఫియా ధరలు కూడా తగ్గించడం లేదు. లారీ ఇసుక రూ. 14 వేల నుంచి రూ. 15 వేలకు అమ్మకాలు సాగిస్తున్నారు. వైసీపీ హయాంలో రియల్ ఎస్టేట్ పతనమైంది. నిర్మాణాలు తగ్గుముఖం పట్టాయి. లేదంటే ఇసుకకు డిమాండ్ ఏర్పడి ధరలు మరింత పెంచేసేవారు. బ్లాక్ మార్కెట్‌కు అడ్డూ అదుపూ లేకుండా పోయేది. ఇసుకకు అంతగా డిమాండ్ లేకపోయినా సరే ధరలు తగ్గించడం లేదు. ప్రభుత్వ ధరల పేరుతో మాఫియా అడ్డంగా దోచేస్తోంది. తెలుగుదేశం హయాంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశారు. అధిక ధరలకు అడ్డుకట్ట వేసేందుకు ఉచిత విధానాన్ని తెరపైకి తెచ్చారు. తవ్వకం, రవాణా చార్జీలు మాత్రమే వసూలు చేశారు. దాంతో ఇసుక గరిష్టంగా రూ. 10 వేలకు లభ్యమయ్యేది. ఒక్కోసారి రూ. 9 వేలకే అమ్మకాలు సాగించిన సందర్భాలున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానానికి స్వస్తి పలికారు. కొన్నాళ్లపాటు ఇసుక లేకుండా చేశారు. భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారు. తర్వాత ప్రభుత్వమే విక్రయాలు సాగించింది. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే అమ్మకాలు సాగాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అడ్డంగా దోచుకున్నారు. ఆ తర్వాత ప్రైవేటు ఏజన్సీకి బాధ్యతలు అప్పగించారు. అనుమతులు ముగిసిన తర్వాత ఏజన్సీ ముసుగులో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇసుక ర్యాంప్‌లు నడిచాయి. నిల్వలు చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వల నుంచి అమ్మకాలు సాగించారు. బొండు ఇసుకను ప్రత్యేకంగా తరలించి కోట్లు గడించారు.
అనుమతులు చూపితేనే వదులుతాం
నడిపూడి ర్యాంప్‌లో ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్థులు
పెనుగొండ, మార్చి3:పెనుగొండ మండలం నడిపూడి ఇసుక ర్యాంప్‌లో మూడు రోజులుగా రాత్రి, పగలు ఇసుక తవ్వకాలు జరుపు తున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. పర్యావరణ అను మతులు లేవని జిల్లాస్థాయి అధికారులు చెబుతున్నారు. కాని ర్యాంప్ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టనట్లు వ ్యవహరించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఇసుక ఎగుమతులు జరుపుతుండగా గ్రామస్థులు లారీలను అడ్డుకున్నారు. దీంతో ర్యాంప్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి గ్రామస్థులతో మాట్లాడారు. అనుమతి పత్రాలు చూపిస్తేనే లారీలను వదులుతామని చెప్పారు. అనుమతి పత్రాలు చూపించి తోలుకోవాలని ర్యాంప్ నిర్వాహకులకు పోలీసులు సూచించారు. దీంతో ఉదయం నుంచి సాయంతరం వరకు ర్యాంప్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. నిర్వాహకులు అనుమతి పత్రాలు చూపి స్తామంటూ సాయంత్రం వరకు చెబుతూ వచ్చారే కానీ చూపించలేక పోయారు. ఇటీవల గత కలెక్టర్ పి.ప్రశాంతి సైతం ఇసుక ర్యాంప్‌ను సందర్శించారు. ర్యాంప్‌నకు అను మతులు లేవని ఎవరైనా ఇసుక తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయి నప్పటికి ర్యాంప్‌లో ఇసుక అక్రమార్కులు దందా కొనసాగిస్తున్నారు.