Share News

నిబంధనలు బేఖాతర్‌..

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:39 AM

ఏలూరు ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేసిన సమయంలో ఆ పార్టీ నాయకులు నిబంధనలు ఉల్లంఘించారు.

నిబంధనలు బేఖాతర్‌..

(ఏలూరు కలెక్టరేట్‌)

ఏలూరు ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేసిన సమయంలో ఆ పార్టీ నాయకులు నిబంధనలు ఉల్లంఘించారు. నామినేషన్‌ దాఖలు సమయంలో ఆర్వో కార్యాలయమైన కలెక్టరేట్‌కు 100 మీటర్ల మేర ఎవరూ లోనికి రాకుండా ఆంక్షలు ఉన్నాయి. అయితే వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరు కుని భారీ ఎత్తున వాహనాలను కలెక్టరేట్‌ చుట్టూ నిలుపుదల చేశారు. నామినేషన్‌ దాఖలు సమయంలో ఐదుగురికి మించి అభ్యర్థి వెంట లోపలకు వెళ్లకూడదు. అయితే సునీల్‌కుమార్‌ వెంట మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆళ్ళ నాని, ఎంపీ కోటగిరి శ్రీధర్‌, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వర రావు, కొఠారు అబ్బయ్య చౌదరి, విజయ్‌ రాజుతో పాటు పలువురు నాయకులను కలెక్టరేట్‌లోకి అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ యాదవ్‌ నామి నేషన్‌ సందర్భంగా విపరీతమైన ఆంక్షలు పెట్టిన పోలీసులు చివరకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను సైతం కలెక్టరేట్‌లోకి రాకుండా అడ్డుకున్నారు. అదే పోలీసులు మరుసటి రోజు అధికార పార్టీ నాయకులను మాత్రం లోపలికి అనుమతించడంతో పోలీ సులు పక్షపాత వైఖరి అవలంభిస్తున్నా రంటూ ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - Apr 24 , 2024 | 12:39 AM