Share News

బంధువుల ఇంటికొచ్చి వెళ్లిన కొద్దిసేపటికే..

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:55 PM

బంధువుల ఇంటికి వచ్చి వారితో సరదాగా మాట్లాడి ఆ తరువాత వెళతామని చెప్పిన కొద్ది సేపటికి ఆ దంపతులు అనంతలోకాలకు వెళ్లిపోయా రు.

బంధువుల ఇంటికొచ్చి వెళ్లిన కొద్దిసేపటికే..
ప్రమాదానికి కారణమైన కారు

హైవేపై బైక్‌ను ఢీకొన్న కారు.. దంపతులు మృతి

ఏలూరు క్రైం, జనవరి 11 : బంధువుల ఇంటికి వచ్చి వారితో సరదాగా మాట్లాడి ఆ తరువాత వెళతామని చెప్పిన కొద్ది సేపటికి ఆ దంపతులు అనంతలోకాలకు వెళ్లిపోయా రు. పెదవేగి మండలం మొండూరు పంచాయతీ అంకంపాలెంకు చెందిన చౌటుపల్లి రాటాలు(52), ఆయన భార్య అమ్మాజీ(48) కూలిపనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా వివాహాలు చేశారు. గురువారం సాయంత్రం ఏలూరు సమీపంలోని దుగ్గిరాలలో ఉన్న బంఽధువుల ఇంటికి వారిద్దరూ కలిసి బైక్‌పై వచ్చి వారితో కాసేపు సంతోషంగా గడిపారు. అనంతరం ఇంటి నుంచి బయలు దేరి జాతీయ రహదారిపై దుగ్గిరాల బ్రిడ్జి వద్ద నుంచి ఆశ్రం వైపు వెళ్తుండగా మార్గమధ్యలో చొదిమెళ్ళ బ్రిడ్జిపై విజయవాడ వైపు నుంచి వెనుక వస్తున్న కారు అతివేగంగా బైక్‌ను ఢీ కొనడంతో వీరిద్దరూ ఎగిరి చెల్లాచెదురుగా పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. హైవే పెట్రోలింగ్‌ పోలీసులు, ఏలూరు రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వా సుపత్రికి తరలించి ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో వారు హైదరాబాద్‌ నుంచి కాకినాడకు వెళ్తున్న ట్టుగా గుర్తించారు. ఈ ఘటన బంధువులనే కాకుండా అంకంపాలెంలో తీవ్ర విషాధాన్ని నింపింది. ఈ ప్రమాద ఘటనపై ఏలూరు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం ఆ రెండు మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించనున్నారు.

Updated Date - Jan 11 , 2024 | 11:55 PM