Share News

కౌంటింగ్‌ ప్రక్రియకు సర్వం సిద్ధం : కలెక్టర్‌

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:49 AM

ఎన్నికల కౌంటింగ్‌ను పార దర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వై.ప్రసన్న వెంక టేశ్‌ తెలిపారు.

కౌంటింగ్‌ ప్రక్రియకు సర్వం సిద్ధం : కలెక్టర్‌
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ ఇతర అధికారులు

ఏలూరు సిటీ, జూన్‌ 3 : ఎన్నికల కౌంటింగ్‌ను పార దర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వై.ప్రసన్న వెంక టేశ్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపుపై సోమవారం ఆయన మాటా ్లడుతూ ‘ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి 14 టేబుళ్లు, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశాం. ఆయా నియోజకవర్గాలలోని పోలింగ్‌ కేంద్రా లను అనుసరించి 16 నుంచి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చర్యలు తీసుకున్నాం. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపునకు సంబం ధించి సాయంత్రం నాలుగు గంటలలోపు పోస్టల్‌ బ్యాలెట్‌లకు సంబంధించి ఐదు గంటలలోపు పూర్తి ఫలితాలు అందిం చేందుకు ఏర్పాట్లు చేశాం. కౌంటింగ్‌ కేంద్రం వద్ద పటిష్ఠమైన నాలుగు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశాం. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలులో ఉంది. ఓట్ల లెక్కింపు అనంతరం శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయి. 292 మంది మైక్రో పరిశీలకులను, 577 మంది కౌంటింగ్‌ సిబ్బంది (కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌ అండ్‌ కౌంటింగ్‌ అసిస్టెంట్‌)లను నియమించాం. పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ ఉదయం 8 గంటలకు, ఈవీఎం కౌంటింగ్‌ ఉదయం 8.30 గంటలకు ప్రారంభం అవుతుంది. కౌంటింగ్‌ ఏజెంట్లను ఉదయం 7 గంటల తర్వాత ఎట్టి పరిస్థితులలోను లోపలకు అనుమతించరు. ఆర్వో టేబుల్‌ వద్ద పోటీ చేసే అభ్యర్థి లేదా ఎన్నికల ఏజెంట్‌లో ఒక్కరిని మాత్రమే అనుమతిస్తారు. ఈవీ ఎంలోని ఓట్లను, పోస్టల్‌ బ్యాలెట్‌లను లెక్కింపు పూర్తయిన తర్వాత, ఐదు వీవీ ప్యాట్‌ మిషన్లలో స్లిప్‌లను లెక్కిస్తారు. జిల్లాకు నలుగురు కేంద్ర ఎన్నికల పరిశీలకులను ఓట్ల లెక్కింపు పరిశీలనకు నియమించారు. కౌంటింగ్‌ ఏజెంట్లు ఫారం –17–సి కాపీ, పెన్‌/పెన్సిల్‌, సాదా కాగితం/ నోట్‌ ప్యాడ్‌ మాత్రమే తీసుకువచ్చేందుకు అనుమతి ఉంది. కౌంటింగ్‌ హాలులోకి ప్రవేశించడానికి కౌంటింగ్‌ ఏజెంట్లు అపాయింట్‌ మెంట్‌ లెటర్‌ రెండవ కాపీని తప్పనిసరిగా సమర్పించాలి. కౌంటింగ్‌ సెంటర్‌ ప్రాంగణంలోనే మీడియా సెంటర్‌, పబ్లిక్‌ కమ్యూనికేషన్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. రౌండ్‌ వారీ ఫలి తాలు మీడియా సెంటర్‌కు అందించబడతాయి.

ఫ ఓట్ల లెక్కింపు విషయంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితేష్‌కుమార్‌ వ్యాస్‌ అన్నారు. న్యూఢిల్లీ నుంచి సోమవారం సాయంత్రం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీలతో వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కార్య క్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. స్థానిక ఎన్‌ఐసీ నుంచి జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్నవెంకటేష్‌, ఎస్పీ మేరీప్రశాంతి , కౌంటింగ్‌ పరిశీలకులు హాజరయ్యారు.

Updated Date - Jun 04 , 2024 | 12:49 AM