Share News

ఇంటింటికీ రాదు.. వీధి చివరే రేషన్‌

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:14 AM

నెలవారీ రేషన్‌ సరుకులను కారు ్డదారుల ఇళ్ల ముంగిటనే అందజేస్తానని చెబుతూ ప్రభుత్వం మూడే ళ్ల క్రితం ప్రవేశపెట్టిన డోర్‌ డెలివరీ పథకం పూర్తిగా నీరు కారింది. పథకం అమలు దగ్గర నుంచి ఏ ఒక్క గుమ్మం ముందు సరుకులు అందజేసిన దాఖలాలు లేవు.

ఇంటింటికీ రాదు.. వీధి చివరే రేషన్‌
ఏలూరులో ఎమ్డీయూ వాహనం వద్దకు వెళ్లి రేషన్‌ తీసుకుంటున్న కార్డుదారులు

15 కార్డుదారులకు ఒకేచోట రేషన్‌ పంపిణీ

వలంటీర్ల సమక్షం తప్పనిసరి

కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తున్న వాహన నిర్వాహకులు

ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 11 : నెలవారీ రేషన్‌ సరుకులను కారు ్డదారుల ఇళ్ల ముంగిటనే అందజేస్తానని చెబుతూ ప్రభుత్వం మూడే ళ్ల క్రితం ప్రవేశపెట్టిన డోర్‌ డెలివరీ పథకం పూర్తిగా నీరు కారింది. పథకం అమలు దగ్గర నుంచి ఏ ఒక్క గుమ్మం ముందు సరుకులు అందజేసిన దాఖలాలు లేవు. అనుకున్న విధంగా డోర్‌ డెలివరీ చేపట్టాలని చేసిన ప్రయత్నాలు అన్ని వమ్ముకావడంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో చివరికి వీధి డెలివరీకి అధికారికంగానే అనుమతి ఇచ్చేందుకు అన్ని రకాల కసరత్తులు పూర్తిచేసి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఒకచోట, పట్టణ ప్రాంతాల్లో 4,5 వీధులు కలిసే కూడళ్ల వద్ద సరుకులు పంపిణీ జరుగుతోంది. వలంటీర్ల సమక్షంలో సరుకులు పంపిణీ జరగాలని, ప్రారంభంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్త ర్వులూ అమలుకు నోచుకోలేదు. ఈ పథకం పూర్తిగా అభాసు పాలైందని గ్రహించిన ప్రభుత్వం కనీసం వీధి డెలివరీ చేసి సజావుగా పంపిణీ జరిపించాలనే యోచనతో కొత్త విధానానికి సిద్ధమైంది.

చివరికి వీధి డెలివరీకి మొగ్గు

డోర్‌ డెలివరీ విధానం అభాసుపాలు కావడంతో వీధి డెలివరీ విధానమైనా సజావుగా చేయాలని ప్రస్తుత ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. అంత్యోదయ కార్డులు కలుపుకుని జిల్లాలో 5,02,803 రేషన్‌ కార్డులు ఉన్నాయి. మొత్తం 5,060మంది వలంటీర్లు ఉన్నారు. డెలివరీ ఎలా చేస్తారంటే జిల్లాలో ఒక్కో వలంటీర్‌ పరిధిలో 50 నుంచి 75 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీధుల్లో ఎక్కడెక్కడ రేషన్‌ పంపిణీ చేయాలో వలంటీర్లు గుర్తించాల్సి ఉంది. వలంటీర్లు ఐదు నుంచి 8 స్థలాలను గుర్తించాల్సిందిగా ఆదేశించారు. ప్రతినెల పంపిణీ చేసే ప్రత్యేక స్థలాన్ని జీపీఎస్‌ ద్వారా లొకేట్‌ చేసి ఉంచాలి. ఈ లొకేషన్‌ పరిధిలోకి వచ్చే 10 లేక 15 రేషన్‌ కార్డులను ఈ లొకేషన్‌కు మ్యాపింగ్‌ చేయాలి. ఇవన్నీ సజావుగా పూర్తయిన తర్వాత సరుకుల డెలివరీ కోసం సరిగ్గా జి.పి.ఎస్‌ ద్వారా నిర్దారించిన స్థలం వద్దే వాహనాన్ని ఉంచి దాన్ని మ్యాపింగ్‌లో ఉన్న కార్డులకు వలంటీర్‌ వాహనం వద్దే ఉండి పంపిణీ చేయాలి. లొకేషన్‌తో పాటు రుజువుగా ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి. ఏ రోజు వాహనం ఆ లొకేషన్‌కు వస్తుంది. ఎన్ని కార్డులకు డెలివరీ చేయా లి, స్థలం, వివరాలను వీఽధి డెలివరీ కోసం వలంటీర్లు సిద్ధం చేసి ఉంటా రు. ఈ తతాంగం అంతా గతేడాదే జరగాల్సి ఉన్నా వలంటీర్లు నిరాసక్తత కారణంగా ఆలస్యమైంది.

వ్యతిరేకిస్తున్న ఎమ్డీయూ వాహనదారులు

ఇంతా చేస్తే చివరకు వీధిడెలివరీ విధానం క్రమబద్ధీకరణకు ఎమ్డీ యూ వాహనాల నిర్వాహకులు వ్యతిరేకిస్తున్నారు. వలంటీర్లు గుర్తించిన చోట డెలివరీ చేయడం సాధ్యం కాదనేది వీరి వాదన. ప్రతి 15 కార్డులు పంపిణీ తర్వాత మరోచోటికి వాహనాన్ని మార్చాలంటే ఎలక్ర్టానిక్‌ తూచే యంత్రాలను సర్ది మళ్లీ కొత్తచోట అమర్చాలంటే సమయం వృథా అవు తుందని, కొన్నిసార్లు సిగ్నల్స్‌ అందవని వీరు చెప్తున్నారు. ఇక వలంటీర్ల సమక్షంలో వారి వీలును బట్టి పంపిణీ చేయడం కూడా కుదరదని స్పష్టం చేస్తు న్నారు. ఈ స్థితిలో వీధి డెలివరీ విధానం అసలు జరిగే పనికాదని, వాహనదారులు ప్రారంభంలోనే చేతులెత్తేస్తున్నారు. ఈ దశలో డోర్‌ డెలివరీ కాదుకదా కనీసం వీధి డెలివరీ కూడా ఎలా చేయా లో పాలుపోవడం లేదని అధికారులు వాపోతున్నారు.

Updated Date - Feb 12 , 2024 | 12:14 AM