Share News

సమస్యల హోరు

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:51 PM

నిరుపేదలు, వ్యవసాయ పనులు చేసు కునే కూలీలకు ప్రభుత్వం ఉపాధి లేకుండా చేసిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ విమర్శించారు.

సమస్యల హోరు
పనులు కల్పించాలని కలెక్టరేట్‌ వద్ద ఉపాధి కూలీల ధర్నా

ఉపాధి హామీ పనులు కల్పించాలి

ఏలూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 26: నిరుపేదలు, వ్యవసాయ పనులు చేసు కునే కూలీలకు ప్రభుత్వం ఉపాధి లేకుండా చేసిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ విమర్శించారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ఉపాధి కూలీలు, మహిళలతో సోమవారం ధర్నా నిర్వహిం చారు. రామకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికుల కు, పేదలకు ఉపాధి హామీ పనులే దిక్కు అని, రాష్ట్రప్రభుత్వం 2020లో ఏలూరుచుట్టూ పక్కల ఏడు గ్రామ పంచాయతీలను నగరంలో విలీనం చేయడంతో ఉపాధి పనులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 6వేల కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉన్నాయని, 2020 నాటికి 10 వేల మంది కూలీలు ఉన్నారని, ప్రభుత్వం లెక్కలు చెబుతున్నా అధికార పార్టీ నాయకులు పట్టించుకోలేదన్నారు. పేద కుటుంబాలకు ఉపాధి లేక పట్టణాలకు వలస పోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఏడు పంచాయతీల్లో ఉపాధిహామీ పనులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జి.దుర్గ, బి.ప్రేమకు మారి, బి.నిర్మల, వనరాజ్యం, పి.వజ్రం, లక్ష్మణుడు, బి.పాప, 200మందికి పైగా ఉపాధికూలీలు, మహిళలు పాల్గొన్నారు.

పునరావాస పరిహారం అందించాలి

కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూర్‌ లెవల్‌లో మాధవరం గ్రామానికి పునరావాస పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మాధవరం నిర్వాసితులకు పునరావాస కాలనీలో ఇళ్లను కేటాయిం చి, ప్రస్తుతం కోల్పోతున్న ఇళ్లకు, వ్యక్తిగత ప్యాకేజీ ఇచ్చి త్వరగా తరలిం చాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అంద జేశారు. రాచమడుగు వరలక్ష్మి, నిరంజన్‌, నిర్వాసితులు పాల్గొన్నారు.

గ్రీన్‌ఫీల్డ్‌, ఎత్తిపోతల నిర్వాసితులకు న్యాయం చేయాలి

చింతలపూడి: గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్వాసిత రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని, ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్దార్‌ కార్యాల యం రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌ మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు తీరని అన్యాయం జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గం అన్నా రు. మోసపూరిత వాగ్దానాలు ఇవ్వడం తప్ప రైతులకు చేసిందేమీలేదన్నారు. కలెక్టర్‌ హామీ మేరకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూనిర్వాసిత రైతులకు ఆర్బిట్రేషన్‌ జడ్జిమెంట్‌ వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సర్వీసు రోడ్లు, అండర్‌ పాస్‌లు వేయాలని, బోర్లు, విద్యుత్‌ లైన్లు, ఉద్యాన వన పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం పెంచి ఇవ్వాలని కోరారు. ఎత్తిపోతల పథకం నిర్వాసి తులను ఐదేళ్లుగా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చి మార్కెట్‌ ధర ప్రకారం రైతులకు న్యాయం చేయాలన్నారు. ఈ పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరు, మెట్ట ప్రాంతాలకు తాగునీరు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల భూములను ప్రస్తు తం రెవెన్యూ రికార్డులలో బ్లాక్‌ లిస్టు నుంచి తొలగించాలన్నారు. అనంతరం డీటీ షకీలున్నీసాకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ నాయకులు ఆర్‌వీఎస్‌.నారాయణ, ఎత్తిపోతల పథకం కమిటీ నాయకులు చిట్టూరి అంజి బాబు, సత్యనారాయణ, గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్వాసిత కమిటీ నాయకులు శ్రీనివాసరావు, కె.మల్లికార్జునరావు, రామకృష్ణ, వి.రాజేంద్రప్రసాద్‌, చిలుకూరి శ్రీహరిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

డబ్ల్యూటీవో ఒప్పందాల నుంచి వైదొలగాలి

ఏలూరు టూటౌన్‌: రైతాంగానికి, కార్మికులకు దేశప్రజలకు నష్టం కలిగిం చే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో ఒప్పందాల నుంచి భారత్‌ వైదొలగాలని సంయుక్త కిసాన్‌ మోర్చ నాయకులు డిమాండ్‌ చేశారు. వసంత మహల్‌ సెంటర్‌లో రైతు, కార్మిక, వ్యవసాయ, ప్రజా సంఘాలు డబ్ల్యూటీవోతో ఒప్పంద ప్రతులను దహనం చేశారు. రైతాంగానికి, కార్మికుల కు నష్టం కలిగించేవిధంగా మోదీ ఒప్పందం చేసుకోవడం దుర్మార్గమన్నారు. స్వామినాథన్‌ సిపార్సుల ప్రకారం మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురా వాలన్నారు. విదేశీ వ్యవవసాయ ఉత్పత్తుల దిగుమతులకు పూర్తిగా సుంకా లు ఎత్తివేయడంతో పంటల ధర పడిపోయి రైతలు ఆత్మహత్యలు చేసుకుం టున్నారన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌, ఈకేఎంయూ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, సీఐటీయూ నాయకులు సాయిబాబా, ఏఐటీయూసీ నాయకులు అప్పలరాజు పాల్గొన్నారు.

చింతలపూడి: కేంద్ర ప్రభుత్వం డబ్ల్యూటీవోతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని అఖిలపక్ష రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. సీపీఐ కార్యాల యం నుంచి పాత బస్టాండ్‌ వరకు మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. సీపీఐ జిల్లా నాయకులు ఎం.వసంతరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ ఒప్పందం వలన రైతాంగం తీవ్రంగా నష్టపో తుందన్నారు. ఆహార పదార్థాలపై దిగుమతి సుంకం ఎత్తివేయడం ధరలు పడిపోయాయని, ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయన్నారు. ఈ ఒప్పందం వలన పీడీఎస్‌ పథకాన్ని రద్దు చేస్తున్నారని, ఆహార భద్రత చట్టానికి నష్టం వాటిల్లుతుందన్నారు. దీంతోపాటు వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం దెబ్బతింటుందని ఈ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వి.సుందరరావు, పున్నూరి సోమశేఖర్‌, డి.కృష్ణ, రంగనాథ్‌, కంచర్ల గురవయ్య, ఆర్‌.వి.సత్యనారాయణ, టి.బాబు, జె.రామచంద్రారెడ్డి, ఎస్‌కె.కాలేషా, టి.ప్రసాద్‌, పలువురు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 11:51 PM