Share News

ఏజెన్సీ బంద్‌

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:26 AM

కార్మిక, రైతాంగ సమస్యలపై వామపక్షాలు, రైతు, కార్మికల సంఘాల పిలుపు మేరకు పారిశ్రామిక సమ్మె, గ్రామీణ భారత్‌ బంద్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో విజయవంతమైంది.

ఏజెన్సీ బంద్‌
బుట్టాయగూడెంలో వామపక్ష, ప్రజా సంఘాల ప్రదర్శన

జిల్లాలో పాక్షికం.. నిరసన ప్రదర్శనలు

కదం తొక్కిన రైతు, కార్మిక సంఘాలు

కార్మిక, రైతాంగ సమస్యలపై వామపక్షాలు, రైతు, కార్మికల సంఘాల పిలుపు మేరకు పారిశ్రామిక సమ్మె, గ్రామీణ భారత్‌ బంద్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, దుకాణాలు మూసివేశారు. జిల్లాలో మిగిలిన చోట్ల పాక్షికంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నా రాస్తారోకోతో రైతు, కార్మిక సంఘాలు కదం తొక్కాయి.

బుట్టాయగూడెం, ఫిబ్రవరి 16: కార్మిక, రైతాంగ సమస్యలపై సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, సీపీఎం, సీపీఐ, ఏఐకేఎంఎస్‌, ఏకేఎంఎస్‌, గిరిజన సంఘం, రైతు సంఘం, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యం లో శుక్రవారం ఏజెన్సీలో జరిగిన గ్రామీణ, పారిశ్రామిక బంద్‌ విజయవంత మైంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను, పాఠశాలలు, కళాశాలలను, బంకులను, షాపులను మూయించి వేశారు. బుట్టాయగూడెం సెంటరులో రాస్తారోకో, ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా సంఘాల నాయకులు కారం రాఘవ, తెల్లం రామకృష్ణ, మొడియం నాగమణి, బి.వి నోద్‌, కారం దానయ్య, కట్టం వీరాస్వామి, టి.బాబురావు మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చాక కార్మికులకు, కర్షలకు తీరని అన్యాయం చేస్తున్నారని, రైతాంగ సమస్యలను పట్టించుకోవడంలేదని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతుల హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఢిల్లీలో అడుగుపెట్టకుండా అన్నివిధాలుగా ఆటంకాలు కల్పిస్తూ మో దీ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. పోరాటాలు చేసి సాధించుకున్న కోడ్‌లను 4 కోడ్‌లుగా మార్చడం దుర్మార్గమన్నారు. కె.పోతురెడ్డి, టి.ముత్యాలమ్మ, పి.నాగేశ్వరావు, కె.కన్నారావు, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోలవరం: గ్రామీణ బంద్‌ విజయవంతమైంది. ఏపీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం సంయుక్తంగా పోలవరంలో ఎర్రజెండాలతో ర్యాలీ నిర్వ హించి వర్తక వ్యాపార సముదాయాలను మూయించారు. ఏటిగట్టు సెంటర్‌లో మానవహారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసి విప్లవ గీతాలు ఆలపించారు. రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కుంజం రామారావు, ఎస్‌కె భాషా, మిడియం పోశీరావు, కొమరం రామారా వు, రైతు కూలీ సంఘం, గిరిజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. బంద్‌ ప్రభావం వలన మెయిన్‌ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.

టి.నరసాపురం: కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామీణ భార త్‌ బంద్‌ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. కార్మిక సంఘాలు ఆధ్వ ర్యంలో యూనియన్‌ బ్యాంకు, వెలుగు కార్యాలయం, సచివాలయం మూ యించారు. అంబేడ్కర్‌ సెంటర్లో కార్మికులు ఆందోళన చేపట్టారు. వ్యాపారులు దుకాణాలు మూసి బంద్‌కు మద్దతు తెలిపారు. సీపీఎం మండల నాయ కులు అనుమోలు మురళి, మడకం సుధారాణి తదితరులు ఉన్నారు.

జీలుగుమిల్లి: మండలంలో బ్యాంకు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. జీలుగుమిల్లి ప్రధాన సెంటరులో రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు.తెల్లం దుర్గారావు, ఎన్‌వి.అప్పారావు, కట్టం నాగేశ్వరరావు, సీహెచ్‌.కొండలరావు, సీహెచ్‌.సీతారామయ్య, నాయకులు ఉన్నారు.

కుక్కునూరు: మండలంలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని, స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయాల ని డిమాండ్‌ చేశారు. ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కుక్కు నూరులో దుకాణాలు మూతపడగా, మధ్యాహ్నం వరకు వాహనాలు నిలిచి పోయాయి. వై.నాగేందర్‌ రావు,సాయికిరణ్‌, మహబూబ్‌ పాషా, బయ్యన శ్రీను, సత్యనారాయణ, ఎం.వెంకటాచారి, మడకం వీరయ్య పాల్గొన్నారు.

పెదపాడు: రైతు గెలవాలి.. వ్యవసాయం నిలవాలంటూ బస్టాండ్‌ సెంటర్‌లో సీఐటీయూ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిం చారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల పోరాటానికి అండగా నిల వాలన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, అంగ న్‌వాడీ, ఆశా, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

చింతలపూడి: యర్రగుంటపల్లి, సమ్మెటవారిగూడెం, మల్లాయిగూడెం, ప్రగడవరం గ్రామాల్లో బంద్‌ పాటించారు. చింతలపూడిలో పెట్రోలు బంకు నుంచి బోసుబొమ్మ సెంటర్‌, ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహిం చారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పుల్లూరి సోమశేఖర్‌, ఆర్‌వీ. సత్యనారాయణ, డి.కృష్ణ, టి.బాబు మాట్లాడారు. యూనియన్‌ నాయకులు కంచర్ల గురవయ్య, వీరబాబు, శ్రీను, వెలగాడి అనురాధ, వి.బాలు, బాల రాజు, అలెగ్జాండర్‌, రంగనాఽథ్‌, సరోజిని, మాణిక్యం, ఆశ వర్కర్ల నుండి సుభద్ర, పలువురు సభ్యులు ర్యాలీ, సమ్మెలో పాల్గొన్నారు.

ద్వారకాతిరుమల: సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం నుంచి ప్రధాన రహదారి గుండా గరుడాళ్వార్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వ హించారు. సీఐటీయూ నాయకుడు లింగరాజు, తులసి, లలిత, ధనలక్ష్మి, కట్టా భాస్కరరావు, నాగరాజు, వీర్రాజు, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

భీమడోలు: కార్మికులు, కర్షకులు ఐక్యంగా భారీ ర్యాలీ నిర్వహించి భీమడోలు జంక్షన్‌లో మానవ హారం చేపట్టారు. లింగరాజు, నాయకులు రంగరాజు, కట్టా భాస్కరరావు, నాగరాజు, స్వర్ణకుమారి పాల్గొన్నారు.

పెదవేగి: కేంద్రంలో ప్రధాని మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యురాలు పి.హైమావతి అన్నారు. పెదవేగిలో నిరసన ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో తులసి, రోజా, అనూరాధ, నాగరాజు, సుబ్బారావు, గంగరాజు, వెంకట రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 12:26 AM