Share News

సమ్మెకు సమాయత్తం

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:55 PM

కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్ర దం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌. నర సింహ, కె.శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు

సమ్మెకు సమాయత్తం
కొత్తూరులో ఆందోళన చేస్తున్న రైతు సంఘం నాయకులు

కేంద్ర ప్రభుత్వ విధానాలపై రైతు కూలీ, కార్మిక సంఘాల నిరసన

నేడు బంద్‌ జయప్రదం చేయాలని పిలుపు

ఏలూరు టూటౌన్‌, ఫిబ్రవరి 15: కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్ర దం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌. నర సింహ, కె.శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. అన్నేభవన్‌లో గురువారం ఆయన మా ట్లాడుతూ మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కోసం రైతులు ఢిల్లీలో పోరాడు తున్నారన్నారు. మూడు వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు రైతులు చేసిన పోరాట ఫలితంగా ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోదీ రాతపూర్వకంగా ఇచ్చారన్నారు. హామీలు నెరవేర్చకుండా కేంద్రం రైతులను మోసం చేసిందన్నారు. స్వామినాథన్‌ సిపార్సులు అమలు చేయా లన్నారు. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం తీసుకువచ్చి రుణ మాఫీ చేయాలన్నారు. 50ఏళ్లు దాటిన రైతు, కౌలురైతులకు పింఛన్‌ ఇవ్వాల న్నారు. ఢిల్లీ రైతు ఉద్యమంలో మరిణించిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషి యా ఇవ్వాలన్నారు. రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. నేడు జరగబోయే బంద్‌ విజయవంతం చేయాలని కోరారు.

కొయ్యలగూడెం: దేశవ్యాప్త చేపట్టే నిరసనలు కార్యక్రమాలు, గ్రామీణ బంద్‌ జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌.రాంబాబు కోరారు. గురువారం పోస్టర్లు విడుదల చేశారు. కొత్తచట్టాలు వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్‌ కార్యక్రమాల్లో కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

జంగారెడ్డిగూడెం టౌన్‌: మోదీ ప్రభుత్వం రైతు వ్యవసాయ కార్మిక కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం జరుగుతున్న గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని రైతు కార్మిక వ్యవసాయ కార్మిక ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. గురువారం ప్రజా సంఘాల కార్యాలయంలో కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. పి.సూర్యారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేవీ.రమణ, జీవరత్నం మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల ను అమలు చేయకుండా మోసగిస్తోందన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, గనులు, విద్యుత్‌, అటవీ సంపదలను, రవాణా, బ్యాంకులు ఎల్‌ఐసీ, తదితర సంస్థలను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించాలని చూస్తోందని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కార్మిక కోడ్‌లుగా తెచ్చిందని, రైతాంగ ఉద్యమానికి తలవంచి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసిన మరొక రూపంలో అమలు చేస్తోందన్నారు. ప్రజలంతా బంద్‌ జయప్రదం చేయాలని కోరారు. లక్ష్మణరావు. బి.నాని, పి.సత్తిబాబు, జు.ఆనందరావు, కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

పోలవరం: సంయుక్త కిసాన్‌ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు గ్రామీణ బంద్‌కు సహకరించాలని గిరి జన సంఘం, రైతు కూలీ సంఘం సంయుక్తంగా గురువారం ఎర్రజెండాలతో ర్యాలీ నిర్వహించారు. కుంజం రామారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన అన్ని రకాల హామీలను అమలు చేయాలన్నారు. శుక్రవా రం చేస్తున్న బంద్‌లో వ్యాపారులు, వర్తక వాణిజ్య సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా పాల్గొని మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో ఏజన్సీ గిరిజన సంఘం నాయకులు మిడియం పోశీరావు, కొమరం రామారావు తదితరులు పాల్గొన్నారు.

పెదపాడు: కేంద్రంలో మోదీ ప్రభుత్వం రైతు ఉద్యమంపై నిరంకు శ చర్యలు చేపట్టడం దుర్మార్గమని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ అన్నారు. గ్రామీణ భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో పెదపాడు మండలం కొత్తూరులో ఎడ్లబండ్ల, ట్రాక్టర్లతో గురువారం ప్రదర్శన నిర్వహించారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు డిమాండ్స్‌ పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే మోదీ ప్రభుత్వం వారిపై యుద్ధం ప్రకటించడం అన్యాయమన్నారు. ఇచ్చిన హామీ మేరకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. ప్రదర్శనలో రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 11:55 PM