కొనసాగుతున్న వర్షాలు
ABN , Publish Date - Jul 07 , 2024 | 12:19 AM
జిల్లాలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కొనసాగుతున్నాయి.
ఏలూరు సిటీ/పోలవరం, జూలై 6 : జిల్లాలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కొనసాగుతున్నాయి. పోలవరంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీగా వర్షం కురిసింది. మెయిన్ రోడ్డు, బెస్తావీధి, కొత్తపేట, బాపూజీ కాలనీలలో డ్రెయినేజీ వ్యవస్థ సరిలేక నీరు నిలిచింది. మండలంలోని పలు గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.జిల్లాలో గడచిన 24 గంటల్లో బుట్లాయిగూడెం మండలంలో 50 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో గడచిన 24 గంటల్లో సరాసరి వర్షపాతం 15.2 మి.మీ నమోదైంది. ఆగిరిపల్లిలో 36.4, లింగపాలెం 34.4, కొయ్యలగూడెం 30.2, జంగారెడ్డిగూడెం 29.8, పోలవరం 29.2, టి.నరసాపురం 28.4, నూజివీడు 23.6, చాట్రాయి 22.2, జీలుగుమిల్లి 19.8, కైకలూరు 18.6, చింతలపూడి 16.6, వేలేరుపాడు 15, మండవల్లి 12.4, కుక్కునూరు 12, పెదపాడు 8.8, పెదవేగి 8.8, కలిదిండి 6.4, ముసునూరు 6, కామవరపుకోట 5.2, ఏలూరు రూరల్ 4.8, ఏలూరు అర్బన్ 4.6, నిడమర్రు 1.2, ముదినేపల్లిలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
12 గంటలు అంధకారంలో..
పోలవరం, జూలై 6 : పోలవరంలో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పోలవరం గ్రామంలో అంధకారం నెలకొంది. విద్యుత్ సరఫరా లేక ఒకవైపు దోమలు, మరోవైపు ఉక్కబోతతో ప్రజానీకం, వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందు లకు గురయ్యారు. విద్యుత్ శాఖ సిబ్బంది పంట పొలాల్లో పొదల మధ్య జోరున కురుస్తున్న వర్షంలో ఆరు గంటల సేపు శ్రమించి అంతరాయానికి కారణమైన విద్యుత్ లైన్లను సరిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరిం చారు. తరచూ అప్రకటిత విద్యుత్ కోతలతో ఇబ్బందులకు గురవుతున్నామని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.