Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

పల్స్‌ పోలియో విజయవంతం చేయాలి

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:07 AM

పల్స్‌ పోలియో శిబిరాల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు ఓలియో చుక్కలు వేయించాలని కె.గోకవరం వైద్యాధికారి ఎమ్డీ అబీదా కోరారు.

పల్స్‌ పోలియో విజయవంతం చేయాలి
చేబ్రోలులో పీహెచ్‌సీ సిబ్బంది, విద్యార్థుల ర్యాలీ

గ్రామాల్లో వైద్య సిబ్బంది అవగాహనా కార్యక్రమాలు

లింగపాలెం, మార్చి 2: పల్స్‌ పోలియో శిబిరాల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు ఓలియో చుక్కలు వేయించాలని కె.గోకవరం వైద్యాధికారి ఎమ్డీ అబీదా కోరారు. కె.గోకవరం పీహెచ్‌సీలో శనివారం సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం నిర్వహించే శిబిరాల్లో పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో ఐదేళ్ల ల్లోపు పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేయించేలా చర్యలు తీసుకోవాల న్నారు. స్వచ్ఛంద సంస్థలు, సేవాభావంతో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం అవగాహన ర్యాలీలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

ఉంగుటూరు: పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలని చేబ్రోలు వీధులలో పీహెచ్‌సీ సిబ్బంది అవగాహనా ర్యాలీ నిర్వహించారు. వైద్యాఽధికారులు వర్మ, శ్రావణ్‌రెడ్డి పాల్గొన్నారు. 34 పల్స్‌ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామని, 2355 మంది పిల్లలను గుర్తించామని వివరించారు.

కొయ్యలగూడెం: పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని బయ్యన్న గూడెం పీహచ్‌సీ డాక్టర్‌ సత్యనారాయణ కోరారు. బయ్యన్నగూడెంలో వైద్య సిబ్బంది, గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు. అన్ని గ్రామాల్లో పోలియో చుక్కలు వేస్తారని, ప్రతీ ఒక్కరు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. ప్రధాన సెంటర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. విస్తరణాధికారి సుబ్రహ్మణ్యం, సిబ్బంది మేరీగోల్డ్‌, చాన్‌భాష, మరియమ్మ పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:07 AM