విద్యాబోధనలో అలసత్వం వద్దు
ABN , Publish Date - May 19 , 2024 | 12:18 AM
విద్యార్థులకు అందించే విద్యాసామగ్రిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని, విద్యాబోధనలో అలసత్వం వహిస్తే సహించేది లేదని విద్యాశాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశించారు.
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్
తాడేపల్లిగూడెం రూరల్/ భీమడోలు/ ఉంగుటూరు, మే 18 : విద్యార్థులకు అందించే విద్యాసామగ్రిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని, విద్యాబోధనలో అలసత్వం వహిస్తే సహించేది లేదని విద్యాశాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశించారు. తాడేపల్లిగూడెం పట్టణంలో విద్యాకానుక స్టాక్ పాయింట్, పాఠ్యపుస్తకాల స్టాక్ పాయింట్‌లను పరిశీలించారు. తాడేపల్లిగూడెం మండలం దండగర్ర జడ్పీ ఉన్నత పాఠశాలలో ఐఎఫ్‌పీ కిట్‌లను ఎలా ఉపయోగిస్తున్నారో ఉపాధ్యాయులచే ఆపరేట్ చేయించారు. అనంతరం గ్రామంలో పదో తరగతి టాపర్‌తో మాట్లాడారు. అనంతరం ఏలూరు జిల్లాలోని భీమడోలు మండలం భీమడోలు, గుండుగొలను హైస్కూళ్లు, ఉంగుటూరు మండలం నారాయణపురం మహాత్మా గాంధీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఆయన సందర్శించారు. భీమడోలు మండలంలో పాఠ్యపుస్తకాల స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నారాయణపురం కాలేజీలో నాడు నేడు పనుల ప్రగతిని పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. తాడేపల్లిగూడెంలో జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌వీ రమణ, ఏపీసీ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.