విద్యుత్ కట్..కట
ABN , Publish Date - Jun 01 , 2024 | 12:42 AM
విద్యుత్ కోతలతో జనం విలవిల లాడుతున్నారు. జిల్లాలో విద్యుత్ కోతలు జఠిలంగా మారా యి. ఒక పక్క తీవ్ర ఉష్ణోగ్రతలు, మరో పక్క అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.
పెరుగుతున్న విద్యుత్ వినియోగం.. ఎండల తీవ్రతతో విద్యుత్ అంతరాయాలు
ఏలూరు సిటీ, మే 31 : విద్యుత్ కోతలతో జనం విలవిల లాడుతున్నారు. జిల్లాలో విద్యుత్ కోతలు జఠిలంగా మారా యి. ఒక పక్క తీవ్ర ఉష్ణోగ్రతలు, మరో పక్క అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. విద్యుత్ సరఫరాకు సరిపడా విద్యుత్ కోటా వచ్చినా తార స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు ట్రాన్ష్‌ఫార్మర్లు మొరాయిం చడం, సాంకేతిక పరంగా విద్యుత్ ఇబ్బందులు ఏర్పడుతుం డడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నా యి. అప్రకటిత విద్యుత్ కోతలు తట్టుకోలేక వినియోగ దారులు అవస్థలు పడుతున్నారు. ప్రచంఢ భానుడి ప్రతా పంతో ఉక్కబోత విపరీతంగా పెరగడం, బయటకు వెళితే ఎండ తీవ్రత, ఇంట్లో ఉంటే విద్యుత్ కోతలతో ఇబ్బందులు తాళలేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. రోహిణి కార్తెలో కోతలు విపరీతంగా పెరిగాయి. అప్రకటిత విద్యుత్ కోతలను రాత్రి సమయాల్లో విధించడం వల్ల జనం నిద్రకు దూరమవుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత సమయంలో విద్యుత్ కోతలు విధించడం వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పనులు సక్రమంగా జరగడం లేదు. నాలుగు రోజు లుగా ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో జిల్లాలో విద్యు త్ వినియోగం పెరగడంతో విద్యుత్ అంతరాయాలు పెరుగు తున్నాయి. అప్రకటిత విద్యుత్ కోతల అమలులో భాగంగా విద్యుత్ సరఫరాను గంట నుంచి రెండు గంటల పాటు నిలిపివేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. ఒక పక్క ఎండవేడిమి భరించలేక, మరో పక్క విద్యుత్ కోతలతో ఉక్కబోత భరించలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జిల్లాలో ఎటువంటి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని వారు కోరుతున్నారు.
వేళాపాళా లేని విద్యుత్ కోతలతో అవస్థలు
మండవల్లి : మండవల్లి పరిసర గ్రామాల్లో ఎండ తీవ్రతకు తోడు మూడు రోజులు నుంచి కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ ఎల్‌ఎస్ భాస్కరరావు, మండల శాఖ అధ్యక్షుడు టి.అప్పారావు ఆరోపించారు. శుక్రవారం మండ వల్లిలో వారు విలేకరులతో మాట్లాడుతూ మూడు రోజుల నుంచి కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలి యక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మండ వల్లి, పెరికేగూడెం, కొర్లపాడు, లింగాల, కానుకొల్లు, గన్నవరం, కలవపూడి, సింగనపూడి తదితర గ్రామాల్లో గురువారం రాత్రి 8 గంటల నుంచి సుమారు 11గంటల వరకు కరెంటు కోతతో జనం ఇబ్బందులు పడ్డారన్నారు. మరోవైపు కరెంటు కోత సమయంలో దోమలు విజృంభిస్తున్నాయన్నారు. సంబంఽధిత అధికారులు స్పందించి కరెంట్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
విద్యుత్‌శాఖ తీరుపై ఆగ్రహం..
పోలవరం, మే 31 : పోలవరం మండలంలో కొన్ని రోజు లుగా జరుగుతున్న విద్యుత్ కోతల పట్ల అయా గ్రామస్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ విద్యుత్ కోత ఉంటుందని ప్రకటించిన విద్యుత్ శాఖ అఽధికారులు 3 గంటల వరకూ విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నుంచి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెం సబ్ స్టేషన్ వరకు 400 కేవీ విద్యుత్ వైర్ల కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. కొన్ని రోజులుగా ఎండల తీవ్రత పెరిగి వడగాల్పులు, ఉక్కబోతతో గ్రామస్థులు ఇబ్బందులకు గురవుతున్నారని విద్యుత్ సరఫరా లేకపోవడంతో మరింత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని విద్యుత్ సరఫరాకి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అయా గ్రామస్థులు కోరారు.