Share News

పోస్టల్‌ బ్యాలెట్‌ సద్వినియోగం చేసుకోవాలి : డీఆర్వో

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:20 AM

అర్హులైన ప్రతీఒక్కరు పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయభాస్కరరావు తెలిపారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ సద్వినియోగం చేసుకోవాలి : డీఆర్వో
అధికారులతో సమీక్ష చేస్తున్న డీఆర్వో ఉదయ భాస్కరరావు

భీమవరం టౌన్‌, ఏప్రిల్‌ 24 : అర్హులైన ప్రతీఒక్కరు పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయభాస్కరరావు తెలిపారు.బుధవారం వివిధ శాఖల అధికారులతో డీఆర్వో సమీక్షించారు. వివిధ శాఖలలో పనిచేస్తూ వచ్చేనెల 13న ఓటు వేయడానికి వీలుకాని ప్రతి ఒక్కరూ పోస్టల్‌ బ్యాలెట్‌ నమోదు చేసుకొని వచ్చేనెల 6,7,8 తేదీలలో ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టామన్నారు. 85 సంవత్సరాలు వయసు దాటిన వారు, 40 శాతం వికలాంగత్వం కలిగిన వారు హోమ్‌ ఓటింగ్‌కు అర్హులని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 1,113 మంది హోమ్‌ ఓటింగ్‌కు నమోదు చేసుకున్నామన్నారు. అత్యవసర సేవలు అందించు వివిధ శాఖల ఉద్యోగులు పోలింగు రోజు డ్యూటీలో వున్న అత్యవసర సర్వీసులో పనిచేయు 33 శాఖలకు చెందిన ఉద్యోగులకు, అధికారులకు పోస్టల్‌ ఓటింగు సౌకర్యం కల్పించామన్నారు. వారు పారం– 12డి దరఖాస్తును రిటర్నింగ్‌ అధి కారికి అందచేసి రిటర్నింగ్‌ అధికారి వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో వచ్చేనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వినియోగించుకొనవచ్చునని తెలిపారు. జిల్లా సీప్‌ నోడల్‌ అధికారి జి.సి.హెచ్‌ ప్రభాకర్‌, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు, ఆర్టీసీ ఏవో గీతావాణి, ఎక్సైజ్‌, పోలీస్‌, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:20 AM