Share News

ఉద్యోగులంతా ఓటుహక్కు వినియోగించుకునేలా చేయండి

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:26 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో ఉద్యోగులందరూ ఓటుహక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాని కోరినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు తెలిపారు.

ఉద్యోగులంతా ఓటుహక్కు వినియోగించుకునేలా చేయండి

వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రరాజు

ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 23: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో ఉద్యోగులందరూ ఓటుహక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాని కోరినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 15 వేల మంది గ్రామ రెవెన్యూ అధికారులకు, ఇతర ఉద్యో గులకు ఓటుహక్కు వినియోగించు కోవాలంటే ప్రస్తుతం పని చేస్తున్న ప్రాంతం నుంచి ఫారం– 12 ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌తో ఓటుహక్కు వినియోగించుకోవాలని చెపుతున్నారని కాని చాలా జిల్లాల్లో ఈ రకమైన పరిస్థితి కనిపించడం లేద న్నారు. చాలామంది గ్రామ రెవెన్యూ అధికారులు, బీఎల్‌వోలుగా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని దానివల్ల వారి సొంత గ్రామంలో ఓటుహక్కు విని యోగించుకోవడానికి చాలా జిల్లాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ తీసుకోవడానికి నిరాకరిస్తు న్నారన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులందరికి ఆ నియోజకవర్గంలో ఓటుహక్కు వినియోగానికి రిటర్నింగ్‌ అధికారి పరిధిలో చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వా లని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న బీఎల్‌వోలకు గత రెండేళ్ల నుంచి గౌరవవేతనం ఇవ్వ లేదని ఆ నిధులు తక్షణం విడుదల చేయాలని, ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు.

Updated Date - Apr 24 , 2024 | 12:26 AM