Share News

ఎక్కడెక్కడ... బలమెంత?

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:51 AM

ఎన్నికల రణరంగంలో తాడోపేడో తేల్చుకోవ డానికి రాబోయే మూడువారాలే కీలకం. నోటిఫి కేషన్‌ వెలువడడంతో ఇప్పటివరకు జరిగే తంతు ఒక ఎత్తు, ఇక ముందు జరగబోయేది ఇంకో ఎత్తు. అభ్యర్థుల రోజువారీ కదలికలపై ఎన్నికల నిబంధనల నీడ వెన్నాడుతూనే ఉంటుంది.

ఎక్కడెక్కడ... బలమెంత?

నామినేషన్ల ముందే అంచనాలు. తగ్గట్లుగానే స్థానిక వ్యూహం

సామాజిక వర్గాల మద్దతే అత్యంత కీలకం.. కూటమి అంచనాలు ఏమిటి?

ఇక మిగిలింది మూడు వారాలే

(ఏలూరు, ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

ఎన్నికల రణరంగంలో తాడోపేడో తేల్చుకోవ డానికి రాబోయే మూడువారాలే కీలకం. నోటిఫి కేషన్‌ వెలువడడంతో ఇప్పటివరకు జరిగే తంతు ఒక ఎత్తు, ఇక ముందు జరగబోయేది ఇంకో ఎత్తు. అభ్యర్థుల రోజువారీ కదలికలపై ఎన్నికల నిబంధనల నీడ వెన్నాడుతూనే ఉంటుంది. ఇప్ప టికే కొందరు అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టు కుని అన్ని సర్దేసినట్టు చెబుతున్నారు. సామాజిక వర్గాలు, మహిళా గ్రూపులు, యువత టార్గెట్‌గా అంతా వ్యవహారం సాగుతోంది. ఎంపీ అభ్యర్థులే ఈసారి అత్యంత కీలకం. బలం, బలహీన తలను అంచనా వేసు కునే పనిలో పడ్డారు.

బలమెంత? బలహీనత ఏంటి ?

ఓవైపు అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం ప్రతి విషయాన్ని ఆరా తీస్తుంది. వ్యయ పరిశీలకులను గురువారం ఎన్నికల సంఘం జిల్లాకు పంపింది. ప్రతీది ఆచీతూచీ అభ్యర్థులు నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ప్రతి వ్యయాన్ని పరిశీలకులు గమనిస్తారు. ఇప్పటికే అభ్యర్థు లంతా గడిచిన నెలన్నర రోజులుగా విస్త్రృత ప్రచారం చేశారు. అన్ని వర్గాలను తమవైపు తిప్పుకోవడానికి ఎత్తులు, పై ఎత్తులు వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఇప్పటికే ఏడు నియోజక వర్గాల పరిధిలో ఎవ రంతటి వారుగానే ప్రచారంలో ముందుకు సాగు తుండగా ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌ తోడు అయ్యారు. ఎన్నికల వ్యూహంలో పదునుగా వ్యవహరించడం, ఏ నియోజక వర్గం లో ఎలాంటి ప్రధాన సమస్యను ప్రజలు ఎదు ర్కొంటున్నారు, వాటి పరిష్కార మార్గాలు, తాను చేయబోయే పనుల గురించి ఎంపీ అభ్యర్థిగా మహేష్‌ ఒకవైపు, ఇంకోవైపు ఎమ్మెల్యే అభ్యర్థు లంతా గడిచిన ఐదేళ్లలో ఆగిన అభివృద్ధిని తిరిగి పునరుద్ధరిస్తామంటూ భరోసా ఇచ్చారు. దీనికి తోడు ఏఏ వర్గాల్లో తమకు బలం ఉందో తాము ఎక్కడ బలహీనంగా ఉన్నామో అంచనాలకు వచ్చేశారు. ఒకవైపు మండుటెండలు కాస్తున్నా ఖాతరు చేయకుండా ప్రచార హోరు దాదాపుగా అన్నిపార్టీలు సాగిస్తూనే ఉన్నాయి.

ఎంపీ అభ్యర్థే అత్యంత కీలకం

ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలో టీడీపీ అభ్యర్థిగా కూటమి పక్షాన మహేష్‌ కుమార్‌ యాదవ్‌ అన్నితానే వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థులతో ఏరోజుకారోజు ఎన్నికల వ్యూహంపై చర్చించడం, పరిష్కార మార్గాలు తమకు మద్దతిచ్చే వారితో ప్రత్యేక చర్చలు, అధికార వైసీపీకి దీటుగా తాము ఎలా వ్యవహరించాలో, నియోజక వర్గాల్లో ఏ స్థాయి లో ఆధిపత్యం దిశగా అడుగులు వేయాలో కూటవి మహేష్‌ ఇప్పటికే చురుకైన పాత్ర పోషి స్తున్నారు. నియోజక వర్గాల్లో నేతలు, కూట మి అభ్యర్థుల మధ్య సమన్వయానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్‌ పోటీ పడుతుండగా, ఆయన కు దీటుగా ముందంజ వేసేలా ప్రణాళికా బద్ధంగా ప్రచారం చేస్తున్నారు.

సామాజిక వర్గాల చుట్టూనే..

ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలో ఈసారి భిన్నమైన వాతావరణం ఉంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ కూట మిగా ఏర్పడటం, అధికార వైసీపీని ఢీకొనే ఎత్తు లు, పై ఎత్తులకు దిగుతున్నారు. ఒక సామాజిక వర్గంతో అధికారపార్టీ ప్రసన్నానికి ప్రయత్నిస్తే అదే తరుణంలో కూటమి తనశైలిని మార్చి ఆ సామాజికవర్గం నుంచే తమకు మద్దతు దక్కేలా జాగ్రత్తలు పడుతున్నారు. ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నగర పంచాయ తీల్లో బలమైన సామాజిక వర్గాలు తమకు మద్దతు పలికేలా జాగ్రత్తలు పడుతున్నారు.

కూటమి అంచనాలు ఏంటి ?

తమతమ నియోజకవర్గాల్లో తమకు ఎలాంటి మద్దతు లభిస్తుంది? ఏఏ వర్గాల నుంచి సాను కూలత ఉంది? యువత, రైతులు, మహిళల్లో ఎంతెంత శాతం తాము మొగ్గుచూపుతారనే దానిపై ఇప్పటికే పల్లె, పట్టణం తేడా లేకుండా తాము ప్రచారం చేసిన ప్రాంతాలన్నింటిలోనూ కూటమి అభ్యర్థులే కాకుండా అధికార వైసీపీ అంచనాలు వేస్తున్నారు. ప్రత్యేకించి జనసేనకు మద్దతు ఉన్న ప్రాంతాలపై అటు కూటమి, ఇటు వైసీపీ అటెన్షన్‌గా ఉన్నాయి. అత్యధికులు చేజారుతుండడం వైసీపీని కలవర పాటుకు గురిచేస్తోంది.

ఈ మూడు వారాలే కీలకం

రాబోయే మూడువారాలు పోటీచేసే అభ్యర్థు లకు అత్యంత కీలకం. ఇప్పటికే నియోజక వర్గా ల్లో అభ్యర్థులంతా రెండు,మూడుసార్లు ప్రచారం చేశారు. ఈసారి వ్యక్తిగత నిందలను పక్కనపెట్టి అధినేతలే లక్ష్యంగా అన్నిపార్టీల అభ్యర్థులు అస్త్ర శస్ర్తాలు సంధిస్తూనే వచ్చారు. ఇప్పటికే అధికార పార్టీకి మూటలు వచ్చి పడ్డాయి. యంత్రాంగం లోనూ కొంతవారికి మద్దతు ఉన్నట్లు కనిపి స్తోంది. ఎక్కడా వెనక్కి తగ్గదు, జనం బలమే మనం బలం అనేరీతిలో కూటమి అభ్యర్థులు ఇప్పటికే స్వీయ సమీక్షలకు దిగుతున్నారు. ఒక టికి రెండుసార్లు పోలింగ్‌ బూత్‌ల స్థాయిలోనూ అంచనాలకు దిగుతున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:51 AM