Share News

రండి మాట్లాడుకుందాం..

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:01 AM

ఈ సంక్రాంతి పండుగంతా ఎన్నికల పండుగే. మిత్రులైనా, శత్రువులైనా పందెం బరిలోను, పందెం బరి బయట ఈ మూడు రోజులు ఒకటవ్వబోతున్నారు. ఆర్థిక పరమైన విష యాలపైనే లోతైన ఒడంబడికలు జరగబోతున్నాయి.

రండి మాట్లాడుకుందాం..

ఊళ్లకు ఎన్నికల పందెం కోళ్లు

మాటామంతీ, వ్యూహ ప్రతివ్యూహాలు అక్కడే..

ఆర్థికపరమైన అంశాల చుట్టూనే ఎత్తుగడలు

సామాజిక వర్గాల వారీగా ఎత్తులు, పైఎత్తులకు సిద్ధం

పండుగే అసలైన వేదిక.. ప్రత్యేక ఏర్పాట్లు

తెలంగాణ, జిల్లాల నుంచి ముఖ్యుల రాక

‘రండి మాట్లాడుకుందాం ఇక సమయంలేదు. ఇప్పటికిప్పుడే అన్నీ మాట్లాడుకుంటే తప్ప సవ్యంగా ఒడ్డెక్కలేం. చేతిలో సరుకు తక్కువగానే ఉంది. ఏది కావాలో, ఏది వద్దో మీసాయమూ కావాల్సిందే. పండుగ పూట కాబట్టి మనం ఎక్కడ కూర్చుని మాట్లాడుకున్నా ఎవరికీ అనుమానమే రాదు’.

‘పండుగకు అందరూ రండి.. మన టీమ్‌ను కూడా తీసుకురండి. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. చెరువు గట్టో, గెస్ట్‌హౌస్‌ కానేకాదు. ఈ మూడు రోజులు ఓ ఇంట్లోనే మీ బస. అన్నీ అక్కడే. సీరియస్‌గా మాట్లాడుకోవాల్సి నవి ఉన్నాయి పార్టీపరంగా కొన్ని అనుమానాలు తీర్చుకోవాల్సి ఉంది. అన్నిటికంటే మించి ఈసారికి మీరు సర్దుబాటు చేయాల్సిందే. మనస్సు విప్పి మాట్లాడుకుందాం’.

‘జెండాలకేం పని. సంక్రాంతి వచ్చిందంటే కోడి పందేలదే కదా. అందరూ చుట్టాలే. పార్టీపరంగా అవసరమేలేదు. మనం మిత్రులుం కాబట్టి ఒకరినొకళ్లు చూసుకుని మాటామంతీ పంచుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులన్నీ అడ్డగోలుగా ఉన్నాయి. రాజకీయమంటే అందరికీ డబ్బే కావాలి. బంధువులైతే ఎప్పుడో చేతులెత్తేశారు. ఇక స్నేహితులుగా మీలాంటి వాళ్ళ మీదే ఆశలు’.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

ఈ సంక్రాంతి పండుగంతా ఎన్నికల పండుగే. మిత్రులైనా, శత్రువులైనా పందెం బరిలోను, పందెం బరి బయట ఈ మూడు రోజులు ఒకటవ్వబోతున్నారు. ఆర్థిక పరమైన విష యాలపైనే లోతైన ఒడంబడికలు జరగబోతున్నాయి. సామా జిక పరమైన, ఆర్థికపరమైన ఈ రెండింటిని పండుగ బ్రేక్‌ అప్‌గా భావిస్తున్నారు. గోదారి జిల్లా నేతలంతా ఇతర ప్రాంతాల్లో తమకు తెలిసిన రాజకీయ బంధువులందరికీ వారం క్రితమే ఆహ్వానాలు పలికారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మర్యాదలకు, కోడి పందేలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ఇదే తరుణంలో రాజకీయ నేతలంతా తమ తోటి, అనుకూల రాజకీయ బంధువులందరినీ గోదావరి జిల్లా లకు ఆహ్వానం పలకడం ఆనవాయితీ. ఈసారి ఈ పిలుపులో ‘ఆర్థిక’ వేట ఉంది. నిన్నమొన్నటి వరకు పందేల్లో ‘రిలాక్స్‌’ కోసం వచ్చే బంధువులంతా ఈసారి కాస్త ఎన్నికల టేస్ట్‌ చూడబోతున్నారు.

అంతా గుట్టుగట్టుగా..

ఎన్నికలకు పట్టుమని వంద రోజులు గడువు లేదు. రాబోయే ఎన్నికలు అత్యంత ఖరీదైనవి కూడా. ప్రధాన పక్షాల నుంచి పోటీ చేయాలనుకుంటున్న వారంతా తమ ఆర్థిక ‘బరువు’పై తంటాలు పడుతున్నారు. ఆయా పార్టీల అధినాయకత్వాలు .. మీరెంత భరిస్తారు, అకౌంట్‌ సిద్ధంగా ఉందా, అనుకున్న పెట్టుబడి ఉంటేనే వ్యవహారం లేదంటే.. అంటూ సంకేతాలు ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కొ నియో జకవర్గంలో ఒక్కొ అభ్యర్థి ఎన్నికల పెట్టుబడి దాదాపు రూ.30 కోట్లు దాటబోతుంది. దీంతో ఆశావహులంతా ఇప్పటి నుంచే డబ్బు వేటలో పడ్డారు. ఈ కారణంగానే ఇప్పటికే కాస్త హంగు, ఆర్భాటం ఉన్న తమ మిత్రులతో చర్చించి ఎన్నికల ‘సర్దుబాటు’కు వీలైనంత మేర సాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో తమం తట తాముగా ఫైట్‌ చేయాల్సిన పరిస్థితులు ఉన్నందున ఎవరుమటుకు వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశా రు. దీనికి సంక్రాంతి పండుగనే వేదికగా ఎంచుకున్నారు. పండుగకు రావాల్సిందిగా పదేపదే ఆర్థికస్తోమత ఉన్న, అంగ బలం ఉన్న ఇరుగుపొరుగు ప్రాంతాలకు చెందిన వారిని ఆహ్వానిస్తున్నారు. తెలంగాణలో తాజాగా అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో దాదాపు అరడజను మంది భీమవరం వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వీరుకాక హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలకు చెందిన మరికొంద రు ఆర్థిక స్తోమత కలిగిన వారు మరికొందరు రాబోతున్నారు. కోడి పందేల బరిలో విచ్చలవిడిగా తిరిగితే పది మందికి తెలియడం ఇష్టంలేని వారంతా తమకు అనువైన ‘డెన్‌’ సమకూర్చాల్సిందిగా కబురు పంపారు. ఇంతకుముందు చెరువుగట్ల మీద, గెస్ట్‌హౌస్‌లు, ప్రధాన హోటల్‌ రూమ్‌ లలో మాటామంతీ పంచుకునేవారంతా దానిని మార్చి ఇప్పుడు ‘సొంతింటి’వైపు మళ్లారు. పండుగ మూడు రోజులు ఆ ఇంట్లోనే అంతా. ఇంట్లో వాళ్ళందరినీ పుట్టిళ ్లకు పంపేసి కొన్ని ప్రత్యేక ఇళ్లను సిద్ధం చేయిస్తున్న ట్టు సమాచారం. వారి వాహనాలన్నీ వేరే చోట పార్కింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత గుట్టెందుకని ఎవరైనా ప్రశ్నిస్తే.. అసలే పరిస్థితులు బాగోలేదుకదా తమకు సాయం చేస్తున్నారని వచ్చి అవతలివాళ్లపై ఇంకేమైనా చేయొచ్చు. అందుకే గుట్టుగా లాగించేస్తే వాళ్ల పని అయి పోతుంది, మా పని పూర్తవుతుందని తమ ముఖ్యులకు చెబుతున్నారు. గతంలో ఆక్వాలో ఆరితేరిన దిగ్గజాలే మాటవరుసకు ఎన్నికల పెట్టుబడి పెట్టేవి. ఇప్పుడు ఆక్వా పరిస్థితులు అంతంతగా మారడంతో అందరి దృష్టి ఎన్నికల పెట్టుబడి పెట్టే ‘పెద్ద’లవైపు మళ్లింది. అందుకనే ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, కైకలూరు, తణుకు వంటి ప్రాంతాలన్నింటిలోనూ ఎక్కడ కోడి పందేల బరులకు అనుమతి ఇవ్వాలనేదానిపై అధికార పక్షం లోనే మల్లగుల్లాలు పడుతున్నారు. చివరి క్షణంలో కోడి పందేల రాబడి కూడా పోగొట్టుకోవడానికి వైసీపీ నేతలెవరూ సిద్ధంగాలేరు. ఎప్పటి మాదిరిగానే అధినాయకత్వాన్ని ఒప్పిం చి మూడు రోజుల పండుగకు అలవోకగా సిద్ధమైపోతున్నారు. ఇప్పుడు పెట్టుబడి కోసం తాపత్రయపడే వారిలో వైసీపీ అను కూలురు ఉండడం మరో విశేషం.

కత్తులు దూసేందుకు కోళ్లు సిద్ధం

ఏలూరు రూరల్‌ : కోడి పందేలకు బరులు సిద్ధమయ్యాయి. కత్తులతో కోళ్లు, పందేలకు జూదరులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి భారీగానే కోడిపందేలు జరిగేలా నాయకులు ఏర్పాట్లు చేశారు. పందేలకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరిస్తున్నా ఖాతరు చేయడం లేదు. ఏలూరు రూరల్‌ మండలం పరిధిలో జాలిపూడి, కోడేలు, తేటపర్రు, గుడివాక లంక, శ్రీపర్రు, పత్తికోళ్ళలంక, పైడిచింతపాడు పరిధిలో కోడిపందేలు వేసేందుకు బరులు దాదాపు సిద్ధమయ్యాయి. నిర్వాహకులు కొన్ని ప్రదేశాలను ఎంపిక చేసుకుని జూదరులకు సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తున్నట్టు తెలిసింది. బుట్టాయగూడెం ఏజెన్సీలో బరులు క్రికెట్‌ స్టేడియాలను తలపిస్తున్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చే పందెంరాయుళ్ల కోసం సర్వం సిద్ధం చేశారు. నిడమర్రు, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి తదితర మండలాల్లో మూడురోజులు కోడిపందేలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఫ్లడ్‌లైట్ల వెలుగులో రాత్రుళ్లు పందేలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం గమనార్హం. చాలాచోట్ల అధికార పార్టీ నాయకుల అండదండలతోనే నిర్వాహకులు బరులను సిద్ధం చేస్తున్నారు. జీలుగుమిల్లిలో బరి విషయమై జనసేన– వైసీపీ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది.

తరలి వస్తున్న అక్రమ మద్యం

ఏలూరు క్రైం, జనవరి 13 : అక్రమ మద్యం, సారా తయారీ విక్రయాలు అరికట్టడంలో రాష్ట్రంలో ఎస్‌ఈబీ అధికారులు వైఫల్యం చెందారని ఎన్నికల కమీషన్‌ సీరియస్‌ అవ్వడంతో చూస్తే ఆశాఖ వైఫల్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. ఏలూరు జిల్లా పరిస్థితిని పరిశీలిస్తే ఉన్న సిబ్బంది పైనే భారం పడి సతమతమవుతున్నారని తెలుస్తోంది. బెల్టు షాపులు చాపకింద నీరులా వెలుస్తున్నాయి. సంక్రాంతి నేప థ్యంలో అక్రమ మార్గంలో మద్యం తీసుకొచ్చేవారు ఇప్పటికే మద్యాన్ని జిల్లాలోకి తెచ్చినట్టు తెలుస్తోంది. నాగిరెడ్డి గూడెం, కొల్లేరులో యథేచ్ఛగా సారా తయారు చేస్తూ విక్రయిస్తూనే ఉన్నారు. తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో పాటు ఇక్కడ దొరకని కొన్ని బ్రాండ్లను అక్రమ మార్గంలో తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. యానాం, గోవా నుంచి మద్యాన్ని తెస్తున్నారు. రానున్న ఎన్నికలు దృష్ట్యా అక్రమ మద్యం ఏరులైపారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో అంతర్‌ రాష్ట్ర చెక్‌ పోస్టులు జీలుగుమిల్లి సమీపంలోని తాటాకులగూడెం, చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం, చింతలపూడి సమీపంలో మరో చెక్‌ పోస్టు ఉంది. ఏలూరు, భీమడోలు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు, పోలవరంలో ఎస్‌ఈబీ పోలీస్‌ స్టేషన్లు ఉన్నా యి. సిబ్బంది అంతతమాత్రమే. ఒక్కొక్క ఎస్‌ఈబీ పోలీస్‌ స్టేషన్‌ పరి ధిలో నాలుగు మండలాలు ఉండడంతో నిఘాలో వైఫల్యం అవుతు న్నారు. జిల్లాలో రెండు టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఈబీ టీమ్‌లు పని చేస్తున్నాయి.

Updated Date - Jan 14 , 2024 | 01:01 AM