Share News

రాజకీయ రాజీనామాలు

ABN , Publish Date - Apr 04 , 2024 | 12:40 AM

ప్రభుత్వం నుంచి ప్రజాధనాన్ని వేతనంగా అందు కున్న వలంటీర్ల రాజీనామాల్లో రాజకీయ డ్రామా నడు స్తోంది. టీడీపీ, జనసేన బలంగా వున్న గ్రామాల్లో అఽధికార పార్టీ నేతల ఒత్తిడితో వలంటీర్లు వరుస రాజీ నామాలు చేస్తున్నారు.

 రాజకీయ రాజీనామాలు

జిల్లా అధికారులకు అందిన వలంటీర్ల రాజీనామా పత్రాలు

(భీమవరం–ఆంఽధ్రజ్యోతి)

ప్రభుత్వం నుంచి ప్రజాధనాన్ని వేతనంగా అందు కున్న వలంటీర్ల రాజీనామాల్లో రాజకీయ డ్రామా నడు స్తోంది. టీడీపీ, జనసేన బలంగా వున్న గ్రామాల్లో అఽధికార పార్టీ నేతల ఒత్తిడితో వలంటీర్లు వరుస రాజీ నామాలు చేస్తున్నారు. ఆచంట నియోజకవర్గంలో అత్యధికంగా వలంటీర్లు వైదొలుగుతున్నారు. ఆ తర్వాత స్థానంలో భీమవరం ఉంది. రాజీనామా చేసిన వలంటీ ర్లు టీడీపీ, జనసేన పార్టీలను విమర్శించడం రాజకీ యాలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతలు వెనకుండి అంతా నడుతున్నారనడానికి ఇదే నిదర్శనం. ఇందుకు తగ్గట్టుగానే అధికార పార్టీ నేతలు వలంటీర్ల నుంచి రాజీనామా పత్రాలను తీసుకుంటున్నారు. వాటిని కార్య దర్శులకు, ఎంపీడీవోలకు పంపుతున్నారు. లేదంటే రాజీ నామాలు చేయాలని ప్రోత్సహిస్తున్నారు. కొందరు వలంటీర్లు అధికార పార్టీ తరపున ప్రచారం చేస్తా మంటూ బాహాటంగా చెబుతున్నారు. కేడర్‌ను కోల్పో యినచోట వైసీపీ నేతలు వలంటీర్లనే నమ్ముకుం టున్నారు. నెలసరి వేతనం ఇస్తామంటూ మభ్య పెడు తున్నారు. వాస్తవానికి వలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వా త అధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మధ్య దూరం పెరిగింది. ఎమ్మెల్యేలంతా వలంటీర్లపైనే ఆధా రపడుతూ వచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వ హించినప్పుడు జనసమీకరణలోనూ వీరిదే కీలక భూమిక. గతంలో పార్టీ కేడర్‌ ఆ బాధ్యత వహించేది. గ్రామాలు, పట్టణాల్లో కార్యక్రమాలను కార్యకర్తలే దగ్గ రుండి నిర్వహించేవారు. నియోజకవర్గ నేతలు హాజర య్యేవారు. ఫలితంగా ఎమ్మెల్యేలకు, కేడర్‌కు రాజకీయ బంధం ఉండేది. ఇప్పుడంతా వలంటీరే చూసుకుంటు న్నారు. ఇది కాస్త రాజకీయ నేతలకు, కేడర్‌కు మధ్య దూరం పెంచేసింది. ఎన్నికలకు వచ్చే సరికి కార్యక ర్తలు కరువయ్యారు. అధికార పార్టీ నేతలు కుల సం ఘాలనే నమ్ముకుంటున్నారు. వారితో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేతప్ప పార్టీ కార్యకర్తలతో ప్రచారాలు నిర్వహించడం, వారిని ముందుండి నడిపిం చడం వంటి కార్యకలాపాలు లేవు. దీంతో ఇప్పుడు వలంటీర్లనే నమ్ముకున్నట్టుంది. ఎన్నికల్లో పాల్గొన కూడదంటూ వలంటీర్లను ఎన్నికల సంఘం దూరం పెట్టడంతో వారంతా రాజీనామాలు చేయాలి.

మరికొందరి రాజీనామా

అత్తిలి/యలమంచిలి : అత్తిలి మండలానికి చెం దిన 50 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. ఎన్ని కల సంఘం ఎన్నికలు పూర్తయ్యే వరకు వలంటీర్లు పింఛన్లు, బియ్యం పంపిణీల్లో పాల్గొనరాదని ఉత్త ర్వులు ఇవ్వడంతో తామంతా రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా పత్రాలను అత్తిలి ఎంపీడీవో పిహెచ్‌ శ్రీనివాస్‌బాబుకు అందజేశారు. యలమంచిలి మండలం కాజ పడమరలో 8 మంది వలంటీర్లు వారి రాజీనామా పత్రాలను పంచాయతీ కార్యదర్శి పాలా శ్రీనివాస్‌కు అందజేశారు. 11 మంది వలంటీర్లకు 8 మంది రాజీనామా చేయడం గమనార్హం.

వీడియో గ్రాఫర్‌ తొలగింపు

పెదవేగి, ఏప్రిల్‌ 3 : దెందులూరు నియోజకవర్గం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లో వీడియో గ్రాఫర్‌ పామర్తి నాగ రాజును విధుల నుంచి తొలగించామని ఆర్‌వో బి.లావణ్యవేణి తెలిపారు. నాగరాజు వైసీపీకి చెందిన వ్యక్తి అని టీడీపీ నాయకులు ఆధారాలు ఇవ్వడంతో విచారణ చేసి అతనిని తొలగించామని వివరించారు.

Updated Date - Apr 04 , 2024 | 12:40 AM