Share News

పోలీసుల దాష్టీకం

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:56 PM

శాంతియుతం గా సమ్మె చేస్తున్న మునిసిపల్‌ కార్మికులపై పోలీసులు విరుచుకుపడ్డారు. మహిళలను సైతం పెడరెక్కలు విరిచి రోడ్లపై ఈడ్చుకుం టూ పోలీసువ్యాన్‌లో పడేసి స్టేషన్‌ కు తరలించారు.

పోలీసుల దాష్టీకం
మహిళలను ఈడ్చుకెళ్తున్న పోలీసులు

వంగాయిగూడెం వెహికల్‌ డిపో వద్ద ఉద్రిక్తత

ప్రైవేటు వ్యక్తులను అడ్డుకున్న మునిసిపల్‌ కార్మికులు

రంగంలోకి దిగిన పోలీసులు

మహిళలను సైతం ఈడ్చుకుంటూ స్టేషన్‌కు తరలింపు

నేడు నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడి

ఏలూరు టూ టౌన్‌, జనవరి 5 : శాంతియుతం గా సమ్మె చేస్తున్న మునిసిపల్‌ కార్మికులపై పోలీసులు విరుచుకుపడ్డారు. మహిళలను సైతం పెడరెక్కలు విరిచి రోడ్లపై ఈడ్చుకుం టూ పోలీసువ్యాన్‌లో పడేసి స్టేషన్‌ కు తరలించారు. వంగాయిగూడెం వెహికల్‌ డిపో వద్ద మునిసిపల్‌ కార్మికులు పదకొండు రోజులుగా చేస్తున్న సమ్మెను చేస్తు న్నారు. శుక్రవారం మునిసిపల్‌ అధికారులు ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి ప్రైవేటు వాహనాలు, క్లాప్‌ ఆటోలను బయటకు తీసుకెళ్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. మా సమస్యలు తీర్చకుండా ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయిస్తే ఊరుకోమని మహిళా కార్మికులంతా వాహనాలకు అడ్డుగా నిలిచారు. దీంతో పురుష కానిస్టేబుళ్లు మహిళలను రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీస్‌ వ్యాన్‌ ఎక్కించి వన్‌టౌన్‌ స్టేషన్‌కు తరలించారు. మిగిలిన కార్మికులంతా స్టేషన్‌ను ముట్టడించ ంతో సాయంత్రం వారిని వదిలేశారు. మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్‌బాబు, నగర అధ్యక్షుడు కృష్ణారావు మాట్లాడుతూ అరెస్టులు చేయడం ద్వారా ఉద్యమం ఆపలేరన్నారు. అక్రమ అరెస్టులు మాని జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విధానం మారకపోతే ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. మున్సిపల్‌ కమిషనర్‌ దౌర్జన్యంగా, బెదిరింపులతో, అక్రమ అరెస్టులు చేయించడాన్ని నిరసి స్తూ శనివారం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామని యూనియన్‌ నాయకుడు సోమయ్య తెలిపారు. ఆటో డ్రైవర్ల యూనియన్‌ ప్రధాన కార్యదర్శి జె.గోపి, తదితరులు పాల్గొన్నారు.

సడలని అంగన్‌వాడీల పోరు

ఏలూరు రూరల్‌, జనవరి 5: తమ సమ స్యల పరిష్కారం కోరు తూ జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవా రం నాటికి 25వ రోజుకు చేరుకుంది. ఏలూరులో ని కలెక్టర్‌ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో హాజరైన అంగన్‌వాడీలు ప్రభు త్వం వెంటనే స్పందించా లని, డిమాండ్లు పరిష్కరించాలని, కనీసవేతనం అమ లు చేయాలని, సీఎం జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని 25 సంఖ్య ఆకారంలో కూర్చొని నినదించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.ఎన్‌.వి.డి ప్రసాద్‌ మాట్లాడుతూ 5వ తేదీలోపు విధుల్లో చేరకుంటే తొలగిస్తామని బెదిరింపు ప్రకటనలు మాని సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలన్నారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు కె.విజయలక్ష్మి, పి.హైమావతి, తదితరులు పాల్గొన్నారు. కాగా అంగన్‌వాడీ సమ్మెలో భాగంగా శనివారం నుంచి 24 గంటల రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.భారతి ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - Jan 05 , 2024 | 11:56 PM