Share News

బదిలీల గుబులు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:05 AM

సార్వత్రిక ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగ నున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా చకచకా తమ పనులను కానిచ్చే స్తోంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి, ఏ అధికారికి ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా విధులను నిర్వర్తించడానికి ఏకంగా అధికారులను జిల్లాలే మార్చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం పక్కా ప్రణాళిక సిద్ధం చేసి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీల గుబులు

ఇప్పటికే 33 మంది సీఐలు బదిలీ

నేడే రేపో ఎస్‌ఐల బదిలీలకు రంగం సిద్ధం

ఏలూరు క్రైం, జనవరి 11 : సార్వత్రిక ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగ నున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా చకచకా తమ పనులను కానిచ్చే స్తోంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి, ఏ అధికారికి ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా విధులను నిర్వర్తించడానికి ఏకంగా అధికారులను జిల్లాలే మార్చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం పక్కా ప్రణాళిక సిద్ధం చేసి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్‌, ఎస్పీ స్థాయి నుంచి ఎస్‌ఐ స్థాయి అధికారి వరకూ ఈ ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో తమ పరిస్థితి ఏమిటని ఏ జిల్లాకు వెళ్తామో అన్న ఆలోచనలో ఉద్యోగలు పడ్డారు. పోలీస్‌ శాఖ లో దీనిపై మరింత తీవ్ర చర్చ సాగుతోంది. ఎందుకంటే ప్రజా ప్రతినిధుల సిఫా ర్సులతోనే చాలామంది తమ పోస్టులను దక్కించుకుని కొనసాగుతున్నారు. ఇప్పు డు ఎన్నికల సమయంలో జిల్లా దాటి మరో జిల్లాకు వెళ్లిపోవాల్సిందేనని ఎన్నికల కమీషన్‌ హుక్కుం జారీ చేయడంతో కొంతమంది అయోమయంలో పడ్డారు. ఎన్నికల కోడ్‌ పూర్తయ్యే వరకు మాత్రమే ఈ బదిలీలలు అని ఆ ఉత్తర్వుల్లో లేక పోవడంతో డీలాపడ్డారు. ఇప్పుడు బదిలీ చేస్తే మరో మూడేళ్లు అక్కడే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండడంతో ఏమి చేయాలా అని ఆలోచనలో పడ్డారు. కలెక్టర్‌ నుంచి ఎస్‌ఐ స్థాయి వరకూ అధికారులు సొంత జిల్లాలో ఎట్టి పరిస్థితిలో పనిచేయకూడదని 2024 జూన్‌ 30 లోపు ఆ జిల్లాలో మూడేళ్లు సర్వీసు పూర్త యితే వారిని వేరే జిల్లాకు బదిలీ చేయాలని స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. కానీ పూర్వం ఉన్న 13 జిల్లాలనే పరిగణలోకి తీసుకుని ఈ బదిలీలు కొనసాగించాలనడంతో మూలిగేనక్కపై తాటికాయ పడ్డట్లుగా కొంతమంది అధికారుల పరిస్థితి ఉంది. పోలీస్‌ శాఖలో ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారుల బదిలీలు ఈనెల 8వ తేదీ చేపట్టారు. ఏలూరు రేంజ్‌ పరిధిలో 33 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. ఇంకా కొంతమంది సీఐలు బదిలీ కావా ల్సి ఉంది. ఇక ఎస్‌ఐల వంతు మిగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 9, 10 తేదీల్లో విజయవాడలో కలెక్టర్‌, ఎస్పీలతో సమావేశం నిర్వహించి ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై కలెక్టర్‌, ఎస్పీలు ఏ చర్యలు తీసుకున్నారో వంటి వివ రాలు తెలుసుకున్నారు. నేడో రేపో జిల్లాలో 13 మంది ఎస్‌ఐలకు బదిలీలు జరు గుతాయని సమాచారం. గతంలో లా అండ్‌ ఆర్డర్‌తో సంబంధం ఉన్నవారిని ఈ బదిలీల ప్రక్రియలో తీసుకున్నారు. ఇప్పుడు అలాంటివి ఏమి లేకుండా అధికారి ర్యాంక్‌ను మాత్రమే చూపించారు. దీంతో లూపులైన్లో పనిచేసే పోలీసు అధికారులు సైతం వేరే జిల్లాకు బదిలీ కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

Updated Date - Jan 12 , 2024 | 12:06 AM