Share News

నిఘా నేత్రం..

ABN , Publish Date - May 19 , 2024 | 12:33 AM

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగినప్పటికీ అనంతరం జిల్లాలో పలుచోట్ల ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వివిధ కారణాలతో ఘర్షణలకు దిగారు. ఈనెల 13వ తేదీ పోలింగ్‌ రోజున చిన్న చిన్న తోపులాటలు, అల్లర్లు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

నిఘా నేత్రం..
ఏలూరు టూటౌన్‌లో శుక్రవారం కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

పోలింగ్‌ అనంతరం చాపకింద నీరులా అల్లర్లు

జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తం

అడుగడుగునా తనిఖీలు.. పోలీస్‌ పికెట్లు

ఏలూరులో ఇప్పటికే కార్టన్‌ సెర్చ్‌

జూన్‌ 15 వరకు జిల్లాలోనే నాగాలాండ్‌, కేంద్ర బలగాలు

ఏలూరు క్రైం, మే 18 : జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగినప్పటికీ అనంతరం జిల్లాలో పలుచోట్ల ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వివిధ కారణాలతో ఘర్షణలకు దిగారు. ఈనెల 13వ తేదీ పోలింగ్‌ రోజున చిన్న చిన్న తోపులాటలు, అల్లర్లు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎస్పీ మేరీ ప్రశాంతి గతంలో ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన నేపథ్యంలో జిల్లా పరిస్థితులపై అవగాహన ఉండడంతో ప్రణాళికాబద్ధంగా ముందస్తు చర్యలు తీసుకుని ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూశారు. జిల్లాకు వచ్చిన సీఐఎస్‌ఎఫ్‌ (కేంద్ర బలగాలు), నాగాలాండ్‌కు చెందిన కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు బందోబస్తుకు వచ్చాయి. ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నాగాలాండ్‌ బలగాలను వినియోగిం చారు. ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌ ఏలూరులోనే ఉండడంతో స్వయం గా ఆయనే పోలింగ్‌ రోజు ఏలూరులోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో పోలీసు అధికారులకు జారీ చేశారు. ఎస్పీ మేరీ ప్రశాంతి కూడా జిల్లాలో పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. మొత్తం మీద పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అయితే ఆ సాయంత్రం నుంచే కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు జిల్లాలో చోటుచేసుకున్నాయి. ప్రతి ఘటనపైన సంబంధిత పోలీస్‌ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లాలో ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయిన విషయం తెలిసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన కేంద్ర సాయుధ బలగాలను జూన్‌ 15 వరకూ ఉంచాలని కేంద్ర ఎన్ని కల సంఘం ఆదేశించింది. ఎన్నికల ముందు ఎలాంటి కవాత్‌లు నిర్వహించారో వాటిని చేపట్టి ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా పోలీస్‌ శాఖ కూడా అప్ర మత్తమైంది. ఎన్నికల అనం తరం దెందులూరు, ఏలూరు, చింతలపూడి, నూజివీడు నియోజకవర్గాల్లో చిన్న చిన్న ఘటనలు జరగడంతో ఎస్పీ సీరియస్‌గా తీసుకున్నారు. ఏలూరు నగరంలో జరిగిన ఘటనలకు స్పందిస్తూ రాత్రి వేళ ఎస్పీ నగరంలో పర్యటించారు. ఆకస్మికంగా కార్టన్‌ సెర్చ్‌ నిర్వహించారు. జిల్లాలో ఉన్న నాగాలాండ్‌, కేంద్ర బలగాలతో రాత్రి వేళ, పగటి వేళ పోలీస్‌ కవాత్‌లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిఘా విభాగాలను రంగంలోకి దించారు. ట్రబుల్‌ మంగర్స్‌ను గుర్తించే పనిలో ఉన్నారు. రౌడీషీటర్లపై నిఘా పెంచారు. అనుమానాస్పదంగా ఉన్నవారిపై, అల్లర్లు సృష్టిస్తారని గుర్తించిన వారిపై గత ఎన్నికల్లో కేసులో ఉన్న వారిని మరోసారి బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారు. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత కూడా మరో 11 రోజులు పాటు కేంద్ర బలగాల సేవలను వినియోగించుకో వాలని, శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఉండడంతో మొత్తం మీద పోలీస్‌ యంత్రాంగం శాంతి భద్రతలపై కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసింది.

జిల్లాలో నిఘా పెంచాం : ఎస్పీ మేరీ ప్రశాంతి

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలింగ్‌ అనంతరం జిల్లాలో నిఘా పెంచాం. శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 52 రాజకీయ సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. పోలీస్‌ పికెట్లను ఏర్పాటు చేసి నాగాలాండ్‌ బలగాలు, కేంద్ర బలగాలతో కార్టన్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాం. అల్లర్లకు పాల్పడినా సంబంధిత రాజకీయ నాయకులను స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్‌ చేస్తున్నాం. ఎవరైనా వినకపోతే చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అసాంఘిక శక్తుల సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడమే కాకుండా రౌడీషీట్‌లను తెరుస్తాం. ఇప్పటికే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశాం.

జిల్లాలో కొనసాగుతున్న తనిఖీలు

సార్వత్రిక ఎన్నిక లకు సంబంధించి ఎన్నికల కోడ్‌ జూన్‌ 4వ తేదీ వరకు అమలులో ఉండడం తో జిల్లా పోలీస్‌ శాఖ యఽథావిధిగానే జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తు న్నారు. ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఉన్న అధికారులు రాత్రివేళ ముమ్మర గస్తీ నిర్వహిస్తున్నారు. మరోవైపు రోడ్డు ప్రమాదాల నివారణకోసం జాతీయ రహదారి, రాష్ట్రీయ రహదారిలో వెళ్ళే వాహన డ్రైవర్లకు ఫేష్‌వాష్‌ నిర్వహిస్తున్నారు. ప్రధాన నగరాల్లో పోలీసు గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తున్నారు. లాడ్జీలను తనిఖీలు చేస్తున్నారు. పోలీస్‌ పికెట్లను, ప్రత్యేక పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజ నీరింగ్‌ కళాశాల వద్ద మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.

Updated Date - May 19 , 2024 | 12:33 AM