Share News

పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం

ABN , Publish Date - Jan 06 , 2024 | 12:00 AM

పోలీస్‌ సిబ్బందిలో క్రీడా ప్రతిభను వెలికితీ యడానికి ‘పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌’ ఎంతో దోహదపడుతుందని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు.

పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం
క్రీడా జ్యోతిని వెలిగిస్తున్న ఎస్పీ మేరీప్రశాంతి

ఏలూరు క్రైం, జనవరి 5 : పోలీస్‌ సిబ్బందిలో క్రీడా ప్రతిభను వెలికితీ యడానికి ‘పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌’ ఎంతో దోహదపడుతుందని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు. ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శుక్రవారం పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను నిర్వహించారు. తొలుత క్రీడాకారుల నుంచి గౌరవవందనాన్ని ఆమె స్వీకరించారు. క్రీడలు ప్రారంభం సందర్భంగా క్రీడా జ్యోతిని ఆమె వెలిగించారు. ఆమె మాట్లాడుతూ 24 గంటలు విధి నిర్వహణలో ఉండే పోలీస్‌ సిబ్బందికి ఈ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు వారిలో ఉన్న క్రీడాప్రతిభకు గుర్తింపు వస్తుందన్నారు. జిల్లా స్థాయి స్పోర్ట్స్‌ మీట్‌లో ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర పోలీస్‌ మీట్‌కు పంపిస్తామన్నారు. కబడ్డీ, వాలీబాల్‌, అథ్లెటిక్‌, హాకీ, 100 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్ల పరుగుపందెం, హైజంప్‌, లాంగ్‌ జంప్‌, ఫుట్‌బాల్‌, టెన్నీస్‌, షటిల్‌ మొదలగు క్రీడలు నిర్వహిస్తామన్నారు. శనివారం సాయంత్రంతో ఈ క్రీడలు ముగుస్తాయన్నారు. ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏఆర్‌ అదనపు ఎస్పీ ఎస్‌ఎస్‌ శేఖర్‌, ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు, ఏఆర్‌డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐ ఆదిప్రసాద్‌, ఆర్‌ఐ పవన్‌కుమార్‌, మహిళా ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 12:00 AM