Share News

ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలి

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:22 AM

రానున్న ఎన్నికల్లో జిల్లా ప్రజలు స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి పోలీస్‌ సిబ్బంది, సాయుధ దళాల సిబ్బందితో నిర్వహించిన ఫ్లాగ్‌ మార్చ్‌లో ఆయనతో పాటు ఎస్పీ డి.మేరీ ప్రశాంతి, జేసీ బి.లావణ్యవేణి తదితరలు పాల్గొన్నారు.

ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలి
పోలీస్‌ కవాతులో పాల్గొన్న కలెక్టర్‌, జేసీ, ఎస్పీ తదితరులు

కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌

ఏలూరు క్రైం/ఏలూరు సిటీ, ఏప్రిల్‌ 2 : రానున్న ఎన్నికల్లో జిల్లా ప్రజలు స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి పోలీస్‌ సిబ్బంది, సాయుధ దళాల సిబ్బందితో నిర్వహించిన ఫ్లాగ్‌ మార్చ్‌లో ఆయనతో పాటు ఎస్పీ డి.మేరీ ప్రశాంతి, జేసీ బి.లావణ్యవేణి తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి జిల్లాలో పోలీస్‌, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖల ఆధ్వర్యంలో చెక్‌ పోస్టుల వద్ద స్టాటిక్‌ సర్వేలైన్సు టీమ్‌ (ఎస్‌ఎస్‌టీ), ఫ్లయింగ్‌ సర్వేలైన్స్‌ టీమ్‌లు (ఎఫ్‌ఎస్‌టీ), వీడియో నిఘా బృందాలు (వీఎస్‌టీ) ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తు న్నా మన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఎనిమిది వేల నుంచి పది వేల వరకు పోలీస్‌ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. దీనిలో కేంద్ర బలగాలు (సీఐఆర్‌ఎఫ్‌) 3 బృందాలు జిల్లాకు కేటాయించారని, అందులో రెండు బృందాలు ప్రస్తుతం జిల్లా అంతటా ప్లాగ్‌ మార్చి నిర్వహిస్తున్నామని మంగళవారం ఏలూరు నగరంలో నిర్వహించామన్నారు. ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా జిల్లా పోలీస్‌ యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఏలూరు ఆర్డీవో ఎన్‌ఎస్‌కే ఖాజావలి, ఏలూరు రిటర్నింగ్‌ అధికారి ఎం.ముక్కంటి, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌. వెంకటకృష్ణ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ భానుశ్రీ, డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్వరరావు, ఏలూరు వన్‌టౌన్‌, టూటౌన్‌, నాలుగో టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌లు రాజశేఖర్‌, ప్రభాకర్‌రావు, వి.వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ పవన్‌కుమార్‌, ఎస్‌ఐ.లక్ష్మణబాబు, సాధిక్‌, ప్రసాద్‌, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మాలతి పాల్గొన్నారు.

ఎన్నికల సమాచారానికి 94910 41435

త్వరలో జరగబోయే ఎన్నికలు నిష్పక్షపాతంగా, సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి వె.ప్రసన్నవెంకటేశ్‌ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్యల కోసం వాట్సాప్‌ మెస్సేజ్‌/ ఫొటోల ద్వారా వాస్తవ సమాచారం ప్రజ లు అధికార యంత్రాంగానికి అందిచాలని కోరారు. వాట్సాప్‌ నంబరు 94910 41435 అందుబాటులో ఉంచామన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:23 AM