Share News

జిల్లాలో కొనసాగుతున్న పోలీసు తనిఖీలు

ABN , Publish Date - May 20 , 2024 | 11:36 PM

సార్వత్రిక ఎన్నికల అనంతరం శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా జిల్లావ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

జిల్లాలో కొనసాగుతున్న పోలీసు తనిఖీలు
ఏలూరులో కారును తనిఖీ చేస్తున్న పోలీసులు

నేరాల నియంత్రణకు నిఘా

ఏలూరు క్రైం, మే 20: సార్వత్రిక ఎన్నికల అనంతరం శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా జిల్లావ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ డి.మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో రాత్రివేళ ముమ్మర గస్తీ నిర్వహిస్తున్నారు. మరోవైపు రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారి, రాష్ట్రీయ రహదారిలో వాహన డ్రైవర్లకు ఫేష్‌వాష్‌ నిర్వహి స్తున్నారు. ప్రధాన నగరాల్లో పోలీసు గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తున్నారు. లాడ్జీలను కూడా తనిఖీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి పోలీస్‌ పికెట్లను, ప్రత్యేక పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌ అనంతరం ఈవీఎంలను ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో భద్రపరిచిన నేపథ్యంలో అక్కడ మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ కాలేజీ చుట్టు పక్కలకు ఎవరూ రాకూడాదని ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. నేర నియంత్రణకు ప్రత్యేక నిఘాను కొనసాగిస్తున్నారు.

Updated Date - May 20 , 2024 | 11:36 PM