Share News

లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి దోపిడీలు

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:15 AM

లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి మోటారు సైకి ల్‌పై తీసుకుని వెళ్లి దోపిడీలకు పాల్పడుతున్న దొంగను తణుకు రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి దోపిడీలు
వివరాలు తెలుపుతున్న డీఎస్పీ మూర్తి

అరెస్టు చేసిన తణుకు పోలీసులు

తణుకు, మార్చి 21 : లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి మోటారు సైకి ల్‌పై తీసుకుని వెళ్లి దోపిడీలకు పాల్పడుతున్న దొంగను తణుకు రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబందిం చిన వివరాలను తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోపవరం గ్రామానికి చెందిన ఆకుల రమేష్‌ వివిధ ప్రాంతాల్లో పలువురిని మోటారు సైకిల్‌ ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశాల్లో చాకు చూపించి వారి వద్ద నున్న బంగారు వస్తువులు దొంగలించడం అలవాటుగా చేసుకున్నాడు. ఏలూరు పట్టణానికి చెందిన పల్లిపోతుల హరిమోహన్‌ పెళ్ళి సంబంధాలు చూస్తూ కమీషన్‌ తీసుకుని జీవిస్తున్నాడు. ఈనెల 18వ తేదీన ఉండ్రా జవరం మండలం పాలంగి గ్రామం వెళ్లేందుకు తణుకు బస్టాండ్‌లో చూస్తుండగా రమేష్‌ తాను పాలంగి వైపు వెళుతున్నాని, అక్కడ దించు తానని చెప్పి హరిమోహనరావును తన మోటారు సైకిల్‌ ఎక్కిం చుకున్నాడు. చీకటిగా ఉన్న ప్రదేశంలో ఆపి చాకు చూపించి మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతి ఉంగరం ఇమ్మని బెదిరించాడు. మోహనరావు ప్రతిఘటించడంతో చేతికి గాయం అయినట్లు రూరల్‌ పోలీసులకు పిర్యాదు చేయగా ఎస్‌ఐ చంద్రశేఖర్‌ కేసు నమోదు చేశారన్నారు. రూరల్‌ సీఐ నాగేశ్వరావు దర్యాప్తు చేపట్టారు. ఉంగుటూరులో నిందితుడిని అతని ఇంటివద్ద 19వ తేదీ సాయంత్రం అరెస్టు చేసినట్లు తెలిపారు. రెండు సంవత్సరాల నుంచి చేసిన నేరాలను ఒప్పుకున్నట్లు వివరించారు. దోపిడీలో ఉపయోగించిన చాకు, మోటారు సైకిల్‌, 24 గ్రామలు బంగారు గొలుసు రెండుతో పాటు మొత్తంగా 40 గ్రాముల బంగారు గొలుసులు (రూ.2.40 లక్షలు) స్వాధీనం చేసుకున్నామన్నారు.24 గంటల్లోనే ముద్దాయిని గుర్తించి అరెస్టు చేసిన సీఐ నాగేశ్వరరావు, సహకరించిన ఎస్‌ఐ చంద్రశేఖర్‌, సిబ్బంది శ్రీనివాసు, అన్వర్‌లను ఎస్పీ అజిత వేజెండ్ల అభినందించారు.

Updated Date - Mar 22 , 2024 | 12:15 AM