Share News

పటిష్ఠ భద్రత

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:55 PM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్‌ శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది.

పటిష్ఠ భద్రత
లింగపాలెంలో పోలీసు, భద్రతా దళాల పహారా

ఓట్ల లెక్కింపు.. గ్రామాల్లో పోలీసు వలయం

వివాదాలకు తావులేకుండా చర్యలు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్‌ శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లాలోని అన్ని మండలాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉందని, ఈ నెల 6 వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని పోలీసు అధికారులు సూచించారు. గ్రామాల్లో గుమిగూడి ఉండడం, ర్యాలీ, ప్రదర్శనలకు అనుమతి లేదని, నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు మైక్‌ ద్వారా ప్రచారం చేస్తున్నారు.

బుట్టాయగూడెం, జూన్‌ 3: ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని, మంగళవా రం ఓట్ల లెక్కిపు సందర్భంగా మండల పరిధిలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకన్న హెచ్చ రించారు. ఆటోలో మైక్‌ ద్వారా సోమవారం మండల కేంద్రం, గ్రామాల్లో ప్రచారం చేయించారు. మండలంలో 144 సెక్షన్‌ అమలులో ఉందని సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదన్నారు. సోషల్‌ మీడి యాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామన్నారు. నాయకు లు, కార్యకర్తలు పోలీసువారికి సహకరించాలన్నారు.

లింగపాలెం: ఎన్నికల నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని, అవాంఛనీయ సంఘటనలు జరిగితే చర్యలు తప్పవని ఎస్సై పి.చెన్నారావు హెచ్చరించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సై పర్యటించారు. మండ లంలో 30 పోలీస్‌యాక్ట్‌తో పాటు 144 సెక్షన్‌ అమల్లో ఉందన్నారు. మండ లంలో సాయుద దళాలతో గస్తీ ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ సమయంలో అల్లరి సృష్టిస్తే వారిపై రౌడీషీట్లు ఓపెన్‌ చేస్తామన్నారు.

టి.నరసాపురం: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ డి.దుర్గా మహేశ్వరరావు హెచ్చరించారు. మండలంలో 144 సెక్షన్‌ అమల్లో ఉందని, గుంపులుగా తిరగడం, ర్యాలీ, బాణసంచా పేల్చడం, రోడ్లపై కేక్‌ కటింగ్‌ నిషేధించినట్లు ఆయన తెలిపారు.

ఉంగుటూరు: ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరూ విపరీత ధోరణి ప్రదర్శించరాదని సీఐ ఎంవీ.సుభాష్‌ సూచించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి శాంతి భద్రతలను కాపాడాలన్నారు. నిడమర్రు, భీమడోలు, గణపవరం సర్కిళ్లలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నంత వరకు పోలీసులకు సహకరించాలన్నారు.

కుక్కునూరు: ఓట్ల లెక్కిపు నేపథ్యంలో మండలంలోని పలు ప్రాంతా ల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. ఫలితాల వెల్లడి అనంతరం అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు, సభలు సమావేశాలు నిర్వహించడానికి వీలులేదని హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని సూచించారు. ఎన్నికల నియామవళి అతిక్రమించినట్లు అయితే వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు.

పెదవేగి: ప్రతిఒక్కరూ ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాల ని ఎస్‌ఐ వి.రాజేంద్రప్రసాద్‌ సూచించారు. ప్రశాంతతకు భంగం కలిగించ కుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో కేసులు నమోదైతే భవిష్యత్‌ను నాశనం చేస్తుందని, యువతకు ఉద్యోగ అవకాశాల సమయంలో అది అడ్డంకిగా మారుతుందన్నారు. ఫలితాలు వెల్లడి తర్వాత రోడ్లపైకి వచ్చి, బాణసంచా కాల్చుతూ సంబరాలు జరప డానికి అనుమతిలేదని, అలా చేస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మద్యం అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారమే కీలకమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మూతపడిన మద్యం షాపులు

బుట్టాయగూడెం: ఓట్ల లెక్కింపు సందర్భంగా మండలంలోని బుట్టాయ గూడెం, రామారావుపేట సెంటరు, నందాపురం ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు సోమవారం మధ్యాహ్నం నుంచి మూతపడ్డాయి. సోమవారం నుంచి మంగళవారం రెండు రోజులపాటు మద్యం దుకాణాలను మూసివే యాలని ఎక్సైజ్‌శాఖకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఇవ్వడంతో షాపులను మూయించివేశారు. సమాచారం తెలిసిన మందు బాబులు ముందుగానే మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు. తిరిగి బుధవారం 11 గంటల తర్వాత తెరుచుకోనున్నాయి.

హోటళ్లు మూసివేత

చింతలపూడి: శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యల్లో భాగంగా చింతలపూడిలో భోజన హోటల్స్‌, కాఫీ హోటల్స్‌, మొబైల్‌ టిఫిన్‌ సెంటర్లు, చిరుతిండి దుకాణాలు సోమవారం మూతపడ్డాయి. సోమ, మంగళ, బుధవారం మూడు రోజులు దుకాణాలు మూసివేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఎవరూ గుంపులుగా ఉండరాదని, పోలీసులకు సహకరించాలని మైక్‌ ప్రచారం చేసినట్లు ఎస్సై కుటుంబరావు తెలిపారు.

Updated Date - Jun 03 , 2024 | 11:55 PM