Share News

సంఘ సంస్కర్త గురజాడ

ABN , Publish Date - Sep 22 , 2024 | 12:04 AM

మహాకవి గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని శనివారం పలు విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

సంఘ సంస్కర్త గురజాడ
గురజాడ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు

ఏలూరు అర్బన్‌, సెప్టెంబరు 21: మహాకవి గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని శనివారం పలు విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో దేవరకొండ వెంకటేశ్వర్లు, పెరి యార్‌ మాట్లాడుతూ గొప్ప వ్యక్తుల అడుగుజాడల్లో నడవాలన్నారు. ప్రిన్సిపాల్‌ గిరిబాబు మాట్లాడుతూ సంఘ సంస్కరణకు, సాహిత్య సంస్కరణలకు గురజాడ తన రచనల ద్వారా మార్గదర్శనం చేశారన్నారు. అధ్యాపకులు పరమేశ, వెంకట్రావు, విజయ్‌కుమార్‌, పద్మావతి, వెంకట దుర్గాప్రసాద్‌, కృష్ణచైతన్య, కావ్యశ్రీ, సుజాత తదితరులు పాల్గొన్నారు. సీఆర్‌ఆర్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కరస్పాం డెంట్‌ విష్ణుమోహన్‌ మాట్లాడుతూ కవిగా, సంఘ సంస్కర్తగా సాంఘిక అసమాన తలను రూపుమాపడానికి గురజాడ కృషి చేశారన్నారు. తెలుగు హెచ్‌వోడి మేడ సాని శ్రీనివాసరావు మాట్లాడుతూ గురజాడ ఆదునిక తెలుగు సాహిత్య యుగకర్త, చిరస్మరణీయుడని, ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం ఈనాటికీ సమాజానికి స్పూర్తిదాయకమన్నారు. ప్రిన్సిపాల్‌ రామరాజు, వైస్‌ప్రిన్సిపాల్‌ విశ్వేశ్వరరావు, వెంకటేశ్వరరావు, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. సెయింట్‌ ఆంథోని స్కూలులో ఉపాధ్యాయులు తోట ఎడ్వర్డ్‌, నర్సింగ్‌, రాకేష్‌, జ్యోతి, దాసు, సుధీర్‌ తదితరులు గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. స్త్రీ విద్యకోసం కృషిచేసిన గురజాడ కారణజన్ముడని పేర్కొన్నారు.

భీమడోలు: గుండుగొలను జడ్పీ హైస్కూలులో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు నిర్వహించారు. కైలా సత్యదీప్‌ చిల్డ్రన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలో గురజాడ చిత్రపటానికి హెచ్‌ఎం సునీత పూలమాలలు వేసి నివాళులర్పించారు. కో ఆర్డినేటర్‌ వినోద్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2024 | 12:04 AM