గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద భక్తుల రద్దీ
ABN , Publish Date - Aug 19 , 2024 | 12:30 AM
అడవి బిడ్డల ఆరాధ్య ధైవం గుబ్బల మంగమ్మ దర్శనానికి ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.
బుట్టాయగూడెం, ఆగస్టు 18: అడవి బిడ్డల ఆరాధ్య ధైవం గుబ్బల మంగమ్మ దర్శనానికి ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఇటీవల ఏజెన్సీలో భారీ వర్షాలతో వాగులు పొంగడంతో అమ్మవారి దర్శనానికి అవకాశం లేకుండా పోయింది. వారం రోజులుగా వాతావరణం పొడిగా ఉండడంతో ఆలయ కమిటీ అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేయడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించు కుని మొక్కుబడులు తీర్చుకున్నారు. వర్షాకాలం కావడంతో మధ్యాహ్నం 3 గంట లకు పూజాధి కార్యక్రమాలు, భోజనాలు ముగించి బయటకు పంపించారు. చాలా కాలం తర్వాత అమ్మవారి ఆలయం ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
కనకదుర్గకు సారె సమర్పణ
చింతలపూడి: సీతానగరం గ్రామంలోని కనకదుర్గమ్మకు శ్రావణ మాసం సందర్భంగా మహిళలు ఆదివారం సారె సమర్పించారు. పసుపు, కుంకుమ, స్వీట్లు, పండ్లు, చీర, రకరకాల స్వీట్లు అమ్మవారికి సమర్పించారు. ముందుగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి ఆలయానికి చేరుకున్నారు. సామూహిక పారాయణ కార్యక్రమం నిర్వహించారు.