Share News

రేపు పవన్‌ కల్యాణ్‌ పర్యటన

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:18 AM

ఎన్నికల ప్రచా రంలో భాగంగా ఈనెల 29వ తేదీ సోమవారం తాడేపల్లిగూడెంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటన ఉంటుందని విజయవంతం చేయాలని నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

రేపు పవన్‌ కల్యాణ్‌ పర్యటన

తాడేపల్లిగూడెం అర్బన్‌/ గణప వరం ఏప్రిల్‌ 27 : ఎన్నికల ప్రచా రంలో భాగంగా ఈనెల 29వ తేదీ సోమవారం తాడేపల్లిగూడెంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటన ఉంటుందని విజయవంతం చేయాలని నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి పిలుపునిచ్చారు. పట్టణంలోని గొల్లగూడెం సెంటర్‌ రామాలయం వద్ద సాయంత్రం 5.30 గంటలకు పవన్‌కల్యాణ్‌ బహిరంగ సభ జరుగుతుందన్నారు. తాడే పల్లిగూడెం నుంచి పిప్పర మీదుగా గణపవరం చేరు కుంటారని జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. గణపవరం సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Updated Date - Apr 28 , 2024 | 12:18 AM