Share News

ఏం చెప్పారు.. ఏం చేశారు?

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:27 AM

ఏం చెప్పారు..? ఏం చేశారు? పోలవరం ప్రాజెక్టు విషయంలో ఐదేళ్ల క్రితం ఏం చెప్పారు. అధి కారంలోకి వచ్చిన ఇన్నాళ్లు ఏం చేశారు..? నిర్వాసిత సమస్యలు తీర్చారా? గిరిజన గ్రామా లు బాగుపడ్డాయా? గిరిజనేతరులు స్థిరపడ్డారా? ఉపాధి ఎక్కడ? వ్యవసాయం మరెక్కడ? నీళ్ళేవి, పచ్చని చేలేవి...? ఈ అంశాలతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ రంగంలోకి దిగబోతున్నారు.

ఏం చెప్పారు.. ఏం చేశారు?

పోలవరం ప్రాజెక్ట్‌పై పవన్‌ కల్యాణ్‌ ఫోకస్‌

నిర్మాణం జగన్‌ వల్లే మూలనపడింది

నిర్వాసితుల సమస్యలు కొండెక్కాయి

ఇస్తామన్న పరిహారం ఈ ఐదేళ్లలో దిక్కులేదు

కాలనీల్లోనూ అన్నీ కష్టాలే..

గిరిజన, గిరిజనేతరుల వ్యథలు ఎన్నో..

నియోజకవర్గం అంతటా కష్టాలే కష్టాలు

జనసేన అభ్యర్థికి ఊతమిచ్చే విధంగా ప్రణాళిక

స్థానిక సమస్యలు అన్నింటిపైనా పవన్‌ ఆరా

వచ్చేవారం పోలవరం నియోజకవర్గ మారుమూల గ్రామాల్లో పర్యటన..

(ఏలూరు, ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

ఏం చెప్పారు..? ఏం చేశారు? పోలవరం ప్రాజెక్టు విషయంలో ఐదేళ్ల క్రితం ఏం చెప్పారు. అధి కారంలోకి వచ్చిన ఇన్నాళ్లు ఏం చేశారు..? నిర్వాసిత సమస్యలు తీర్చారా? గిరిజన గ్రామా లు బాగుపడ్డాయా? గిరిజనేతరులు స్థిరపడ్డారా? ఉపాధి ఎక్కడ? వ్యవసాయం మరెక్కడ? నీళ్ళేవి, పచ్చని చేలేవి...? ఈ అంశాలతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ రంగంలోకి దిగబోతున్నారు. జగన్‌ సర్కార్‌ నిర్లక్ష్యాన్ని నిల దీయాలని నిర్ణయించారు. త్వరలోనే పోలవరం నియోజక వర్గంలో పర్యటించనున్నారు.

ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా రాష్ర్టాన్ని సస్య శ్యామలం చేసే పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ప్రాజెక్టు కోసం తమ సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులను జగన్‌ సర్కార్‌ ముంచేసింది. పుష్కలంగా నీరు అందుతుందని ఆశపడ్డ రైతులను నట్టేట్లో ముంచేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేసి నెపం ఇంకొకరివైపు నెట్టేలా ప్రయత్నించారు. ఈ ఐదేళ్లు ఈ తరహా భాగోతమే సాగింది. దీనిని జనసేనాధిపతి పవన్‌కల్యాణ్‌ నేరుగా ఫోకస్‌ చేయ బోతున్నారు. పోలవరం అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటా యించడంతో చాలెంజ్‌గా తీసుకుని మారుమూల గిరిజన ప్రాంతాలను సందర్శించేలా రూట్‌మ్యాప్‌ సిద్ధం చేయాల్సిం దిగా కోరారు. తాజా సమాచారం ప్రకారం ఆయన పోలవరం నియోజకవర్గంలో వచ్చే వారం రోజుల్లో పర్యటించే అవ కాశాలున్నాయి. ఇంకోవైపు తమ పార్టీకే కేటాయించిన ఉంగు టూరు స్థానాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. పోలవరం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న చిర్రి బాలరాజు ఇప్పటికే ఊరువాడా తిరుగుతున్నారు. ఇంకోవైపు ఈ ప్రాంతం లో పెద్దదిక్కుగా ఉన్న కరాటం రాంబాబు దగ్గరుండి లక్ష్యా లను అందుకునేందుకు వ్యూహం అమలు చేస్తున్నారు. పోల వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఇప్పటికే ఐదేళ్లుగా నిలిపివేశారు. 2014 నుంచి 2019 వరకు దాదాపు 73 శాతం మేర పనుల పురోగతిని సాధించిన టీడీపీ ఆ తర్వాత ఓటమి చెందడంతో వైసీపీ అధికారంలోకి వచ్చినా ఈ పనుల్లో నిస్సహాయత చూపింది. కేంద్రం నుంచి అనుకున్నంత మేర నిధులు రాబట్టలేక పోయింది. ప్రాజెక్టు నిర్మాణం కాస్త మూలన పడింది. ఒక్క స్పిల్‌వే తప్ప మిగతా పనులు అన్ని ఎప్పుడో పడకేశాయి. జంట గుహలు కూలిపోయిన తిరిగి పునర్‌నిర్మాణం చేపట్టనే లేదు. కుడి,ఎడమ కాల్వల్లో పురోగతి లేదు. ఈ అంశాలపై ప్రాజెక్టుపై పూర్తి పట్టున్నా నేతలు, అధికారులను సంప్రదించి పవన్‌కల్యాణ్‌ ఇప్పటికే అవ గాహన తెచ్చుకున్నారు. నియోజకవర్గంలోని మారుమూల పల్లెలను కూడా సందర్శించి నిర్వాసితులను పలుకరించి వారికి ఽధైర్యం చెప్పి మరింత సానుకూలత సాధించేందుకు పక్కా ప్రణాళికతో పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు జరిగేందుకు పట్టుమని మరో 30 రోజులు కూడా గడువు లేనందున ఆలోపే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వాగ్భా ణాలు సంధించబోతున్నారు.

పోలవరంపై పట్టు సాధించేందుకు..

నియోజకవర్గంలో తమ పార్టీ గెలిచేలా ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ ముఖ్య నేతలు అందరితోనూ భేటీ అయ్యారు. అక్కడ ఉన్న సమస్యలు జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు సాగిన విధానాలు, విధ్వంసాలు, నిర్వాసితులను గాలికి వదిలేసిన వైనాలు, రాజకీయంగా గిరిజన కుటుంబాలను అణగదొక్కేసిన పరిస్థితులు, భూసేకరణలో సాగిన అవినీతి, ప్రాజెక్టు నిర్మా ణంలో అవలంభించిన అవలక్షణాలు తదితర అంశాలు అన్నింటిపైన నివేదిక రప్పించుకున్నారు. ఆ నియోజకవర్గంలో సీనియర్ల నుంచి సమాచారం రాబట్టారు. ఎందుకు ఇలా జరి గింది? భవిష్యత్‌లో పార్టీ తరపున ఏం చేయాలి? అనే లక్ష్యాలను విధించుకుని తనంతట తానుగా పోలవరంలో నలుదిక్కులా పర్యటించాలని పవన్‌ భావిస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చేసిందంటూ ఏమీలేదని ప్రత్యే కించి నిర్వాసితుల పరిహారం అందే విషయంలో జరిగిన అవి నీతిని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్ర, శనివారాల్లో ఈ నియోజకవర్గానికి చెందిన కరాటం రాంబాబుతో సహా మరి కొందరితో పవన్‌ చర్చించారు. ‘పోలవరంలో పర్యటనకు నేను వస్తున్నా ఈ నియోజకవర్గం పార్టీకి అత్యంత కీలకం. ఇక్కడ మనపార్టీ గెలవాల్సిందే. తగ్గట్లుగానే పోలవరం ప్రాజెక్టుతో సహా నిర్వాసితుల సమస్యలు అన్నింటిని నివేదిక రూపంలో నాకు పంపండి ఉమ్మడిగా కదులుదాం’ అంటూ నేతలకు దిశ నిర్దేశం చేశారు. గడిచిన ఐదేళ్లల్లో వైసీపీ చేసిన అరాచకాలను, దోపిడీని నిలదీయడం అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి నిర్వాసిత సమస్యలను తీర్చడానికి తమ పార్టీ కీలకభూమిక పోషిస్తోందన్న సంకేతాలను అందరికి తెలిసేలా చేయడం తన పోలవరం యాత్ర లక్ష్యం కావాలని పవన్‌ భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే మొదటి నుంచి వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పట్ల పూర్తి వ్యతిరేకత ఉన్న సీనియర్‌ నేత, ఏజెన్సీలో గట్టి పట్టున్న కరాటం రాంబాబు ఆయన కుటుంబానికి చెందిన మరికొందరు చిర్రి బాలరాజుకు దశ నిర్దేశం చేస్తూ వచ్చారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌తో సాన్నిహిత్యం ఉన్న కరాటం అంతా తానై నియోజకవర్గంలో వ్యూహాలు ఖరారు చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో పవన్‌ కల్యాణ్‌ పర్యటిస్తే గిరిజన, గిరిజనేతర కుటుంబాల్లో పెద్దఎత్తున అనుకూలత వస్తుందని భావిస్తున్నారు. పోల వరం ప్రాజెక్టు నిర్మాణానికి లక్ష కుటుంబాలకు పైగా సర్వం త్యాగం చేశాయి. 2019కి ముందు వైసీపీ వీరికి వంత పాడింది. మొసలి కన్నీరు కార్చింది. మేము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారంగా చెల్లిస్తా మంటూ అప్పట్లోనే జగన్‌ కుక్కునూరు, కొయ్యలగూడెం సభల్లో హామీలు ఇచ్చారు. కాని గడిచిన ఐదేళ్లలో అధికారంలో ఉన్నా ఇక్కడ ఎవ్వరికి సాయం చేసిన పాపాన పోలేదు. దీన్నే పవన్‌కల్యాణ్‌ అస్త్రంగా మలుచుకో బోతున్నారు. తమపార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజును గెలిపించుకుంటే తాము ఎలా అండగా ఉండబోతున్నామో చెప్పేందుకు పవన్‌ తన పర్య టనను వినియోగించుకోబోతున్నారు. దీంతో ఇప్పటివరకు పోలవరంలో ఉన్న స్తబ్ధత తొలగిపోనుంది ప్రత్యేకించి పోల వరం నియోజకవర్గంలో టీడీపీ బలంగానే ఉండడం, కొన్ని మండలాల్లో బీజేపీకి కీలకనేతలు, కార్యకర్తలు ఉండడాన్ని జనసేన ఇప్పటికే అధ్యయనం చేసింది. పవన్‌ తన పోలవరం పర్యటనలో ఈ అంశాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని నేతలతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే చిర్రి బాల రాజు నామినేషన్‌ వ్యవహారం కూడా పక్కాగా పకడ్బందీగా నిర్వహించాలని పార్టీ ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది.

Updated Date - Apr 14 , 2024 | 12:27 AM