Share News

కోడ్‌ వివక్ష

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:23 AM

సార్వత్రిక ఎన్నికలకు సంబం ధించి నగారా మోగడంతో శనివారం సాయంత్రం నుంచే జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిం ది.

కోడ్‌ వివక్ష
భీమడోలులో ఎన్టీఆర్‌ మందిరానికి తెలుపు రంగు వేసిన దృశ్యం

జిల్లాలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌

ఇంకా కొనసాగుతున్న ఫ్లెక్సీల తొలగింపు

సార్వత్రిక ఎన్నికలకు సంబం ధించి నగారా మోగడంతో శనివారం సాయంత్రం నుంచే జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిం ది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం జిల్లాలోని బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపు కార్యక్రమం సాగుతోంది. అయితే మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండెక్ట్‌ను (ఎంసీసీ) కఠినంగా అమలు చేయాల్సిన అధికారులు కొన్నిచోట్ల పక్షపాతం చూపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఏలూరు సిటీ, మార్చి 17: ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనల ప్రకారం ప్రధానంగా ప్రభుత్వ ఆస్తులపై, బహిరంగ స్థలాల్లో, వాల్‌ రైటింగ్‌, పోస్టర్లు/ పేపర్లు లేదా మేదైనా ఇతర రూపంలో కటౌట్‌/ హోర్డింగ్‌లు, బ్యానర్లు , జెండాలు మొదలైన వాటిని ఎన్నికల ప్రకటన వెలువడిన 24 గంటల్లోపే తొలగించాలని ఉంది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పెక్సీలు తొలగింపు, జాతీయ నాయకుల, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. ఎన్నికల

కోడ్‌ వచ్చి 24 గంటలు దాటుతున్నా కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు తొలగింపు పూర్తి కాలేదు. ముఖ్యంగా అధికార వైసీపీ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగింపులో అధికారులు కాస్తా మీనమేషాలు లెక్కిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ప్రభుత్వ పథకాలు తెలిపే బోర్డులు దర్శనమిస్తున్నాయి.

పసుపు రంగును వదల్లేదు..

భీమడోలు : ఎన్నికల కోడ్‌ నిబంధనలు పాటించడంలో అధికారులు పక్షపాత వైఖరిని అనుసరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నిబంధనల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న పార్టీ ఫెక్సీలు తొలగించి, విగ్రహా లకు ముసుగులు వేసే నేపథ్యంలో అధికార పక్షానికి ఒక విధంగా విపక్షాలకు మరో విధంగా నిబంధనలు పాటిస్తున్నారని ఆరోపణ లు వినవస్తున్నాయి. భీమడోలులోని ఎన్టీఆర్‌ విగ్రహానికి ముసుగులు వేసి అధికారులు ఆ విగ్రహం మంది రానికి ఉన్న పసుపు రంగును తొలగించి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. అయితే

అధికార పార్టీకి చెందిన రంగులు, ఫెక్సీలు తొలగించడంలో మీన మేషాలు లెక్కిస్తున్నారని టీడీపీ ఆరోపించింది. అన్ని పార్టీలకు ఒకే నిబంధనలు అమలు చేయాలని వారు డిమాం డ్‌ చేస్తున్నారు. రంగులు తొలగించడంపై భీమడోలు ఎంపీ డీవో స్వర్ణలతను వివరణ కోరగా ఎన్టీఆర్‌ మందిరానికి రంగులు తొలగించడం పొర పాటుగా జరిగిందని, మళ్ళీ రంగులు వేయిస్తామన్నారు. కోడ్‌ అమలులోకి వచ్చిన 72 గంటల్లోపు అన్ని పార్టీల ఫెక్సీలు తొలగించి, విగ్రహాలకు ముసుగులు వేసి నిబంధనలు పాటిస్తామన్నారు.

నిర్లక్ష్యం తగదు : డీపీవో

ఉంగుటూరు : ఎన్నికల కోడ్‌ అమలులో నిర్లక్ష్యం తగదు, ఎన్నికల నియమ నిబంధనలను తూ.చా.తప్పకుండా పాటించాలని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వ నాథ్‌ కైకరంలో పంచాయతీ అఽధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా కైకరం విచ్చేసి ఎన్నికల కోడ్‌ అమలును పరిశీలిం చారు. ఈక్రమంలో గ్రామంలో ముసుగులు వేయని విగ్రహాలను చూసి కార్యదర్శి నాగేంద్ర, ఈవోపీఆర్డీ షేక్‌ షంషుద్దీన్‌లను పిలిచి స్వయంగా తెల్లగుడ్డ కొనిపించి తెప్పించి ముసుగు వేశారు. నారాయణ పురం సెంటర్‌ను పరిశీలించి సిబ్బందిని హెచ్చరించారు.

శ్రీనివాసపురంలో..

జంగారెడ్డిగూడెం టౌన్‌ : ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో గత శనివారం నుంచి ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. అయితే మండలంలోని శ్రీనివాసపురం లో రాజకీయనాయకుల ఫ్లెక్సీలు, నాయకుల సుస్వాగతం బోర్డులపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆదివారం నెట్టింట వార్తలు చక్కెర్లు కొట్టాయి. దీంతో అధికారులు హడావిడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టి ఫ్లెక్సీలను తొలగించారు.

తూతూ మంత్రంగా..

ఏలూరు క్రైం : కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలులో ఉందంటూ ఈనెల 16వ తేదీ ప్రకటించింది. అయితే ఏలూరు నగరంలో మాత్రం ఎన్నికల నియమావళిని తూతూ మంత్రంగానే అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజా ప్రతి నిధులు వివిధ వ్యాపారాల ప్రకటనల పేరుతో హోర్డింగులపై యథేచ్ఛగానే వారి చిత్రపటాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోని తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లపై సీఎం జగన్‌ ఫొటోలు అదే విధంగా ఉండడంతో కొంతమంది ప్రశ్నిం చడంతో ఫొటోలు కనిపించకుండా స్టిక్కర్‌ అంటించారు. డాక్టర్‌ వైఎస్సార్‌ పేరు యఽఽథావిధిగానే ఉంచారు. దీంతో ఎన్నికల కోడ్‌ను తూతూ మంత్రంగానే అమలు చేస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

Updated Date - Mar 18 , 2024 | 12:23 AM