Share News

పంగిడిగూడెం దాడి ఘటనలో..

ABN , Publish Date - Jun 20 , 2024 | 12:11 AM

దివ్యాంగ టీడీపీ నేతపై దాడి చేసిన వైసీపీ అనుకూల సర్పంచ్‌ పత్తిపాటి మహలక్ష్ముడు, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు భీమడోలు సీఐ బి.రవికుమార్‌ తెలిపారు.

పంగిడిగూడెం దాడి ఘటనలో..

నలుగురు వైసీపీ నేతలపై కేసు

ద్వారకా తిరుమల, జూన్‌ 19: దివ్యాంగ టీడీపీ నేతపై దాడి చేసిన వైసీపీ అనుకూల సర్పంచ్‌ పత్తిపాటి మహలక్ష్ముడు, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు భీమడోలు సీఐ బి.రవికుమార్‌ తెలిపారు. ద్వారకా తిరుమల పోలీస్‌ స్టేష న్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ పంగిడిగూడెంకు చెందిన టీడీపీ మండల కార్యదర్శి కాలి అశోక్‌ అనే దివ్యాంగుని వైసీపీకి చెందిన కొందరు మానసికంగా వేధించడంతో పాటు పై నలుగురు పాతకక్షలను పురస్కరించుకుని మంగళవారం దాడి చేశారన్నారు. క్షతగాత్రుడు భీమడోలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా పత్తిపాటి మహలక్ష్ముడు, గుమ్మడి శ్రీను, గుమ్మడి బుచ్చయ్య, గుమ్మడి దేవయ్యలపై ఐపీసీ సెక్షన్లు 341, 323, 506, 34 మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Jun 20 , 2024 | 12:11 AM