Share News

కొరియర్‌ కంపెనీ నుంచి అంటూ కాల్‌..

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:10 AM

‘‘కొరియర్‌ కంపెనీ నుంచి ఫోన్‌ చేస్తున్నాం.. మీకు ఒక కొరియర్‌ వచ్చింది. దానిలో కొన్ని అనుమానపు వస్తువులు ఉన్నాయి.’’ అంటూ బెదిరించి సుమారు ఏడు లక్షలు కాజేశారు.. ఆన్‌లైన్‌ దుండగలు.

కొరియర్‌ కంపెనీ నుంచి అంటూ కాల్‌..

ఆన్‌లైన్‌ మోసానికి భీమవరం వ్యక్తి బలి

దఫదఫాలుగా రూ.7 లక్షలు కాజేశారు

సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

భీమవరం క్రైం, జూలై 27 : ‘‘కొరియర్‌ కంపెనీ నుంచి ఫోన్‌ చేస్తున్నాం.. మీకు ఒక కొరియర్‌ వచ్చింది. దానిలో కొన్ని అనుమానపు వస్తువులు ఉన్నాయి.’’ అంటూ బెదిరించి సుమారు ఏడు లక్షలు కాజేశారు.. ఆన్‌లైన్‌ దుండగలు. భీమవరం టూటౌన్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు ప్రకారం భీమవరం 39వ వార్డు దుర్గాపురానికి చెందిన సింగవరపు గణేష్‌కు కొద్ది రోజుల క్రితం ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది. తాము ముంబై పెడెక్స్‌ కొరియర్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెప్పారు. నీకు ఒక పార్సిల్‌ వచ్చింది. అందులో అనుమానిత ఆరు పాస్‌పోర్టులు, రెండు పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయని ఆ విషయం ముంబై పోలీసులకు తెలిసిపోయిందని ఫోన్‌ చేశారు. అనంతరం మరో నెంబర్‌ నుంచి గణేష్‌కు ఫోన్‌ వచ్చింది.నీకు వచ్చిన పార్సిల్‌ అనుమానాస్పదంగా ఉందని అలాగే నీపేరున ఉన్న కొన్ని బ్యాంక్‌ అకౌంట్‌లుపై అనుమానం ఉందని ఆ అకౌంట్‌లకు డబ్బులు జమ చేయాలని తెలపడంతో గణేష్‌ తన వద్ద డబ్బులు లేవని చెప్పాడు. దీంతో అవతలివారు మేము చెప్పిన విధంగా చెయ్యమని ఫేక్‌ అకౌంట్‌ ద్వారా గణేష్‌ పేరుమీద ఐసీఐసీఐ బ్యాంక్‌లో 16 లక్షల పదకొండువేల ఏడువందల నలభై ఒక్క రూపాయలకు లోన్‌ తీసుకునేలా చేశారు. అనంతరం ఆ సొమ్మును తాము చెప్పిన అకౌంట్లుకు ట్రాన్స్‌ఫర్‌ చెయ్యాలని గణేష్‌ను ఆదేశించారు. అది నమ్మిన గణేష్‌ నాలుగు అకౌంట్లుకు సుమారు రూ.7 లక్షలు వరకు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. తరువాత అనుమానం వచ్చిన గణేష్‌ సైబర్‌క్రైం టోల్‌ఫ్రీ నెంబర్‌ 1930 ఫిర్యాదు చెయ్యడంతో అసలు విషయం బయటకు వచ్చింది. వెంటనే స్పందించిన సైబర్‌ క్రైం పోలీసులు లోకల్‌ పోలీసులు ఆధ్వ ర్యంలో ఆ అకౌంట్లలో ఉన్న సుమారు 5 లక్షలు రూపాయలను ఫ్రీజ్‌ చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఎవరూ కూడా నకిలీ ఫోన్‌కాల్స్‌కు స్పందించవద్దని ఏదైనా అనుమానం వస్తే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చెయ్యాలని సీఐ కోరారు.

Updated Date - Jul 28 , 2024 | 12:10 AM