Share News

ఆ..మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలు

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:35 AM

ఆ మండ లానికి ఇద్దరు ఎమ్మెల్యేలు. సగం గ్రామాలకు ఆచంట ఎమ్మెల్యే ప్రాతి నిధ్యం వహిస్తే మిగతా మండ లాలకు పాలకొల్లు ఎమ్మెల్యే పరిధి లోకి వెళతాయి. ఒక మండలంలో రెండు నియోజక వర్గాలకు ప్రాతినిధ్య వహిస్తోంది...

ఆ..మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలు

ఒక మండలం..రెండు నియోజకవర్గాలు

పోడూరు, ఏప్రిల్‌, 23 : ఆ మండ లానికి ఇద్దరు ఎమ్మెల్యేలు. సగం గ్రామాలకు ఆచంట ఎమ్మెల్యే ప్రాతి నిధ్యం వహిస్తే మిగతా మండ లాలకు పాలకొల్లు ఎమ్మెల్యే పరిధి లోకి వెళతాయి. ఒక మండలంలో రెండు నియోజక వర్గాలకు ప్రాతినిధ్య వహిస్తోంది... పోడూరు మండలం. ఈ మండలంలో 16 గ్రామాలు ఉండగా 8 గ్రామాలు ఆచంట నియోజకవర్గంలో మరో 8 గ్రామాలు పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నాయి. అందుకే మండలాన్ని ఇద్దరు ఎమ్మె ల్యేలు పాలిస్తున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల వరకూ పోడూరు మండలంలోని 16 గ్రామాలు ఆచంట నియోజకవర్గంలో ఉండేవి. 2004 ఎన్నికలు తర్వాత 2008లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన జరిగింది. అప్పటి వరకూ ఆచంట నియోజకవర్గంలో ఉన్న పోడూరు మండ లంలోని 16 గ్రామాల్లో 8గ్రామాలు ఆచంట నియోజకవర్గంలోనికి మిగిలిన 8 గ్రామాలు పాలకొల్లు నియోజకవర్గంలోకి వెళ్లిపోయాయి. పోడూరు, జగన్నాధ పురం, తూర్పుపాలెం, మినిమించిలిపాడు, కవిటం, పి.పోలవరం, గుమ్మలూరు గ్రామాలు ఆచంట నియోజకవర్గంలోనూ, అప్పన్నచెర్వు, పెనుమదం, వద్దిపర్రు, రావిపాడు, మట్టపర్రు, జిన్నూరు, వేడంగి, కొమ్ముచిక్కాల గ్రామాలు పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నాయి. మండలంలో ఒకేసారి ఇద్దరు ఎమ్మెల్యేలు కార్య క్రమాలు పెట్టినప్పుడు మండలస్థాయి అధికారులు తహసీల్దార్‌, ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యుఎస్‌, వ్యవసాయ శాఖ, మండలశాఖ అధికారులు ఇబ్బంది పడు తున్నారు. ఒక్కోసారి పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే పెట్టిన కార్యక్రమానికి హాజరై ఆచంట ఎమ్మెల్యే కార్యక్రమాలకు హాజరు కాకపోతే ఇక్కడికి పలానా అధికారి ఎందుకు రాలేదంటూ అధికారులపై చిర్రుబుర్రులాడిన సంఘటలను కూడా ఉన్నాయి. ఒకే మండలంలో ఇద్దరు ఎమ్మెల్యేల పాలన ఉండటం అధికా రులకు పెద్ద తలనొప్పిగా మారింది.

Updated Date - Apr 24 , 2024 | 12:35 AM