Share News

ట్రిపుల్‌ ఐటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రతిభ

ABN , Publish Date - Jul 15 , 2024 | 12:06 AM

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న టి.చంద్రశేఖర్‌, ఆంధ్రప్రదేశ్‌ రీసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించారు.

ట్రిపుల్‌ ఐటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రతిభ
చంద్రశేఖర్‌

నూజివీడు టౌన్‌, జూలై 14: నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న టి.చంద్రశేఖర్‌, ఆంధ్రప్రదేశ్‌ రీసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించారు. ఏపీఆర్‌సెట్‌ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన టి.చంద్రశేఖర్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ప్రథమ స్థానం సాధించారు. చంద్రశేఖర్‌ను ఆర్జీయూకేటీ అధికారులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.

Updated Date - Jul 15 , 2024 | 12:06 AM