Share News

నూజివీడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా మరీదు కృష్ణ

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:37 AM

నూజివీడు నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మరీదు కృష్ణను ఎంపిక చేస్తూ కాంగ్రెస్‌ అదిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

నూజివీడు  కాంగ్రెస్‌ అభ్యర్థిగా మరీదు కృష్ణ
మరీదు కృష్ణ

నూజివీడు, ఏప్రిల్‌ 2: నూజివీడు నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మరీదు కృష్ణను ఎంపిక చేస్తూ కాంగ్రెస్‌ అదిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దివంగత మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పాలడుగు వెంకట్రావు శిష్యుల్లో ఒకడిగా గుర్తింపు పొందిన మరీదు కృష్ణ 2001 నుంచి 2006వరకు నూజివీడు ఎంపీపీగా పనిచేశారు. ఆయన స్వస్థలం నూజివీడు మండలం మీర్జాపురం. ఎంపీపీగా ఉన్న సమయంలో మరీదు కృష్ణ నూజివీడు మండలంలో బడుగు, బలహీనవర్గాలకు పథకాలను అందించడంతో నియోజకవర్గంలో ఆయన సుపరిచితులు.

Updated Date - Apr 03 , 2024 | 12:37 AM