Share News

2600 మంది అంగన్‌వాడీలకు.. షోకాజ్‌ నోటీసులు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:09 AM

జిల్లావ్యాప్తంగా రెండోరోజు స్ర్తీశిశు సంక్షేమ శాఖ అం గన్‌వాడీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈనెల 9వ తేదీ లోపు విధుల్లో చేరాలని డెడ్‌లైన్‌ను ప్రభుత్వం విధించినా ఈ ఉత్తర్వులను ధిక్కరించినా జిల్లాలోని 2600 మంది అంగన్‌వాడీలకు ఈ నోటీసులు జారీ చే సింది.

2600 మంది అంగన్‌వాడీలకు..  షోకాజ్‌ నోటీసులు
ఎర్రగుంటపల్లిలో అంగన్‌వాడీ సెంటర్‌ తలుపునకు నోటీసు అంటిస్తున్న వీఆర్వో

ఏలూరు రూరల్‌/చింతలపూడి/పెదవేగి, జనవరి 11 : జిల్లావ్యాప్తంగా రెండోరోజు స్ర్తీశిశు సంక్షేమ శాఖ అం గన్‌వాడీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈనెల 9వ తేదీ లోపు విధుల్లో చేరాలని డెడ్‌లైన్‌ను ప్రభుత్వం విధించినా ఈ ఉత్తర్వులను ధిక్కరించినా జిల్లాలోని 2600 మంది అంగన్‌వాడీలకు ఈ నోటీసులు జారీ చే సింది. సమ్మెపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిం చినా వారు వెనక్కి తగ్గకపోవడంతో షోకాజ్‌ నోటీసులు పర్వానికి ప్రభుత్వం తెరలేపింది. ఉద్యోగంలో నుంచి తొలగిస్తామంటూ హెచ్చరిస్తోంది. జిల్లాలో 2 వేలకు పైగా అంగన్‌వాడీ సెంటర్లు ఉండగా, వీటిలో 2300 అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, అయాలు ఉన్నాయి. గత నవంబరు 20వ తేదీ నుంచి ప్రభుత్వానికి సమ్మె నోటీసు లు ఇచ్చిన అంగన్‌వాడీలు డిసెంబరు 12వ తేదీ నుంచి సెంటర్లు మూసివేసి సమ్మెలోకి వెళ్ళారు. దీంతో ప్రభు త్వం సెంటర్ల తాళాలు పగులకొట్టి వాటి పర్యవేక్షణ, పౌష్టికాహారం పంపిణీ బాధ్యతలను ఎంఎస్‌కేలు, వెలు గు గ్రూప్‌ సభ్యులకు అప్పగించింది. కాని సెంటర్లకు చిన్నారులను రప్పించలేకపోయింది. దీంతో కేవలం అత్య వసర ప్రభుత్వ సర్వీస్‌ ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రయో గించాల్సిన ఎస్మా చట్టాన్ని ప్రత్యేక జీవో–2ను తీసుకొచ్చి అంగన్‌వాడీలపై ప్రయోగించింది. అయినా బెదరకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఉద్యోగం నుంచి ఎందుకు తొలగిం చకూడదో కారణం తెలపాలని షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. పదిరోజుల్లోగా సమాధానం చెప్పాలని, లేకుం టే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తు న్నారు. కాగా ప్రభుత్వం సమ్మెపై ఈనెల 13వ తేదీ సీఐ టీయూ నాయకులు, అంగన్‌వాడీ అసోసియేషన్‌ నాయ కులతో చర్చించనున్నట్టు సమాచారం. చింతలపూడి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని 381 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, మినీ కార్యకర్తలు, హెల్పర్లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్టు ఐసీడీఎస్‌ పీవో మాధవి తెలిపారు. లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టు పరిధిలో చింతలపూడి, టి.నరసాపురం, లింగపాలెం మండలాల్లో 177 అంగన్‌వాడీ సెంటర్లు, 30 మినీ సెంటర్లు, హెల్పర్లు కలిపి 381 మంది పనిచేస్తున్నారని, వీరందరికీ రిజిస్టర్‌ పోస్టు ద్వారా అంగన్‌వాడీ సెంటర్లు, ఇళ్ల వద్ద, లేదా ఇంటి గోడపై నోటీసులు వీఆర్వోల ద్వారా అంటించినట్టు తెలిపారు. పెదపాడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 241 సెంటర్లు ఉండగా 238 మది అంగన్‌వాడీ కార్యకర్తలకు, 204 మంది సహాయకు లకు నోటీసులు అందించినట్టు సీడీపీవో కె.విజయలక్ష్మి తెలిపారు.

అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ఏలూరు కలెక్టరేట్‌, జనవరి 11: ‘అంగన్‌వాడీల నిరవధిక సమ్మె రాజకీయ పోరాటంగా మారకముందే ప్రభుత్వం మేల్కొని సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే పండుగ అనంతరం ఉద్యమం రాజకీయరూపం తీసుకుంటుంది’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కలెక్టరేట్‌ వద్ద జరుగుతున్న 31వ రోజు సమ్మెకు, 6వ రోజు 24 గంటల దీక్షలకు సంఘీభావంగా గురువారం ఆయన పాల్గొని ప్రసంగిం చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లింగరాజు అధ్యక్షత వహించారు. శ్రీనివాస రావు మాట్లాడుతూ అంగన్‌వాడీల ఓర్పు, సహనానికి పరీక్ష పెట్టొద్దని వారి ఆగ్రహంతో కొట్టుకుపోవద్దని హితవు పలికారు. సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, డీఎన్‌వీడీ ప్రసాద్‌, కె.విజయలక్ష్మి, వి.సాయిబాబు, హైమావతి, రజినీ, బేబిరాణి, శాంతి, పుష్పరాజ్యం, జయసుధ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:09 AM