Share News

ఓటుపై ..విరక్తి ఎందుకో..!

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:09 AM

ప్రజాస్వామ్యంలో ఓటరు చేతిలో నిశ్శబ్ద విప్లవంగా నోటా మారుతోంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల తీరు నచ్చకో... రాజకీయ పార్టీల మేని ఫెస్టోలు నచ్చకో.. ఎన్నికల సరళి నచ్చకో... ఏదైతైనేం పోటీ చేస్తున్న అభ్యర్థులు తనకు నచ్చలేదంటూ ... ఓటరు పోలింగ్‌ బూత్‌కు పనిగట్టుకొని వచ్చి మరీ తెలియజేస్తు న్నాడు.

ఓటుపై ..విరక్తి ఎందుకో..!

పెరుగుతున్న నోటా పోలింగ్‌ శాతం

నిడమర్రు జూన్‌ 7 : ప్రజాస్వామ్యంలో ఓటరు చేతిలో నిశ్శబ్ద విప్లవంగా నోటా మారుతోంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల తీరు నచ్చకో... రాజకీయ పార్టీల మేని ఫెస్టోలు నచ్చకో.. ఎన్నికల సరళి నచ్చకో... ఏదైతైనేం పోటీ చేస్తున్న అభ్యర్థులు తనకు నచ్చలేదంటూ ... ఓటరు పోలింగ్‌ బూత్‌కు పనిగట్టుకొని వచ్చి మరీ తెలియజేస్తు న్నాడు. తనకు నచ్చకపోతే పోలింగ్‌ బూత్‌ రాకుండా ఉండవచ్చు. కానీ తన అసంతృప్తిని పదిమందికి తెలపడ మే లక్ష్యంగా నోటాను సామాన్యుడు వినియోగిస్తున్నాడు. ఈ మారుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యంలో కొత్త ధోరణిని తీసుకొస్తోంది. ఎన్నికల సంఘం 2013 రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం, చత్తీస్‌ఘడ్‌, ఢిల్లీ రాష్ట్రాలకు జరి గిన ఎన్నికలలో తొలిసారి ఈవీఎంలలో ఈ నోటా ఆప్షన్‌ కేటాయించింది. ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విశ్లేషిస్తే ఏలూరు పార్లమెంటరీ నియోజవర్గంలో నోటాకు 22,515 ఓట్లు నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 13 లక్షల 82 వేల ఓట్లుండగా గెలుపొందిన టీడీపీ అభ్య ర్థికి 7లక్షల 46 వేల ఓట్లు, సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థికి 5లక్షల 64 వేల ఓట్లు రాగా నోటా 22వేల 515 ఓట్లుతో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. జాతీయ పార్టీ కాంగ్రెస్‌ పార్టీ సాధించిన 20,826 ఓట్లు కన్నా నోటా కు అధిక ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఉంగు టూరు అసెంబ్లీ స్థానం పరిధిలో నోటాకు 2,105 ఓట్లు, దెందులూరు– 1,920 ఓట్లు, ఏలూరు– 1,256 ఓట్లు, పోల వరం నియోజకవర్గంలో అత్యధికంగా 5,611 ఓట్లు, చింతల పూడి– 4,121 ఓట్లు, నూజివీడు 2,771 ఓట్లు, కైకలూరులో 1,598 నోటా ఓట్లు నమోదయ్యాయి. అసెంబ్లీ సెగ్మెంట్‌ వారీగా మొత్తం 19,382 ఓట్లు నమోదు కావడం విశేషం.

నోటా ఓట్లు వృథాయేనా..!

ప్రస్తుత ఎన్నికల నిబంధనల ప్రకారం నోటాకు వేయ బడిన ఓట్లు ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపలేకపోతున్నాయి. అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నా నోటాకు వేసే ఓట్లతో ఫలితాలపై ఏ ప్రభావం ఉండక పోవడమే ఇందుకు నిదర్శనం. నోటా ఓట్లు సరళిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు ఎన్నికల్లో నోటా శాతం బట్టి ఆ ఎన్నికను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ ఆచరణ అవుతుందో లేదో చూడాలి.

Updated Date - Jun 08 , 2024 | 12:09 AM