Share News

ఆగని ఆశీలు దందా..

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:54 AM

‘అడ్డగోలుగా ఆశీలు దందా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన కథనం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఆగని ఆశీలు దందా..

అయినా మౌనవ్రతంలో అధికారులు

జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 1 : ‘అడ్డగోలుగా ఆశీలు దందా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన కథనం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది. రోడ్‌సైడ్‌ వ్యాపారులు, ఆశీలు దందా బాధితులు ఇకనైనా ఈ దందా సర్దుమనుగుతుందని భావించారు. కానీ గురువారం కూడా ఈ దందా యథావిధిగా కొనసాగింది. అధికారులు మాకేమీ తెలియదనట్టు మౌనవ్రతం పట్టారు. అనధికారి కంగా రశీదులు ఇవ్వని, అధికంగా వసూలు చేసిన సొమ్ములు ఎటు పోతున్నాయనేది ప్రశ్నగా మారింది. అక్రమ వసూళ్ల దందాలో అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధుల పాత్ర ఉన్నట్టు విమర్శలు గుప్పుమంటున్నా యి. ఏటా మునిసిపల్‌కు సంబంధించి నిర్వహించే ఆశీలు వేలం పాటలో అక్కడకు వచ్చిన వారంతా సిండికేట్‌ అవ్వ డం పాటకు స్వచ్ఛందంగా వచ్చిన వారికి ఎంతో కొంత ముట్టజెప్పి పంపడం జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఏడాదికి ఒకరు వేలం పాట దక్కించుకున్నట్టు పైకి కన్పి స్తున్నా కొన్నేళ్లుగా కొంతమంది కన్నుసన్నలోన్లే వసూలు దందా నడుస్తోంది. వేలం పాట ఎవరి సొంతమైనా వసూలు చేసే వ్యక్తులు మారడం లేదు. బెదిరించడం, భయపెట్టడం, అడ్డగించడం చేయడంలో ఆరితేరిన వారే ప్రస్తుతం ఆశీలు వసూలు చేస్తున్నారని విమర్శలున్నాయి.

Updated Date - Feb 02 , 2024 | 12:54 AM